Water After Fruits: ఈ పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా.. హాస్పిటల్ పాలవ్వడం ఖాయం!
కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత వెంటనే నీరు తాగే అలవాటు ఉన్నవారు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Sun - 22 December 24

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్లు మినరల్స్ ఫైబర్ క్యాల్షియం ఐరన్ వంటి వాటితో పాటు ఇంకా ఎన్నో రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. పండ్లను జ్యూస్ రూపంలో లేదంటే ఫ్రూట్ సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత నీటిని అస్సలు తాగకూడదని దానివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
చాలా మంది రాత్రి లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత పండ్లను తింటారు. ఈ పద్ధతిలో పండ్లు తినడం పూర్తిగా తప్పు. అలాగే చాలా మంది పండ్లు తిన్న తర్వాత ఎక్కువగా నీరు తాగుతుంటారు. ఇది కూడా పొరబాటే. ముఖ్యంగా దానిమ్మ తిన్న తర్వాత పొరబాటున కూడా నీళ్లు తాగకూడదట. ఇలా చేయడం వల్ల వికారం, ఎసిడిటీ, వాంతులు వస్తాయని చెబుతున్నారు. అలాగే అరటి పండ్లను తినడం వల్ల తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. అరటి పండ్లు మలబద్ధకం కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. కాబట్టి వీటిని తిన్న తర్వాత నీరు తాగడం వల్ల అది జీర్ణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే నారింజ, ఉసిరి, ద్రాక్ష వంటి పుల్లని పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయి క్షీణిస్తుంది.
జీర్ణవ్యవస్థ కూడా చెదిరిపోతుంది. అదేవిధంగా పుచ్చకాయ తిన్న తర్వాత కూడా నీటిని తాగకూడదు. పుచ్చకాయలు 75% నీరు ఉంటుంది. ఇది స్వతహాగా నీటి పండు. పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. అలాగే పియర్ పండ్లు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి కాకుండా ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కానీ తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు.