Vitamin D : నరాల జివ్వుమని లాగేస్తున్నాయా…అయితే ప్రమాదంలో పడ్డట్టే..ఏం చేయాలో తెలుసుకోండి..!!
మావనశరీర జీవక్రియలకు అత్యంత ముఖ్యమైంది విటమిన్ డి. కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ధాతువులను శరీరం గ్రహించాలంటే...విటమిన్ డి తోడ్పాటు తప్పనిసరి.
- By hashtagu Published Date - 06:00 PM, Mon - 8 August 22

మావనశరీర జీవక్రియలకు అత్యంత ముఖ్యమైంది విటమిన్ డి. కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ధాతువులను శరీరం గ్రహించాలంటే…విటమిన్ డి తోడ్పాటు తప్పనిసరి. చర్మంపై సూర్యకాంతి పడినప్పుడు విటమిన్ డి అనేది ఉత్పత్తి అవుతుంది. కానీ చాలామందిలో వారికి తెలియకుండానే విటమిన్ డి అనేది లోపిస్తుంది. వారి పనితీరు, లైఫ్ స్టైల్ అనేది ఈ కీలక విటమిన్ లోపించడానికి దారితీస్తుంది.
అయితే విటమిన్ డి లోపంతో నరాల జబ్బులు కలుగుతాయని అధ్యయనాల్లో తేలింది. విటమిన్ డి శరీరంలో తగినంత మోతాదులో లేనట్లయితే..అనేక ఖనిజ లవణాలు కూడా శరీరంలో లోపిస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. ఉదాహరణకు కాల్షియం ఎముకల పటిష్టతకు దోహదపడుతుంది. కానీ విటమిన్ డి తగినంత మోతాదులో లేనట్లయితే కాల్షియం కూడా లోపిస్తుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయని పరిశోధకులు వివరించారు.
ఇక పిల్లల్లో విటమిన్ డి లోపంతో రికెట్స్ వ్యాధి వస్తుందట. ఎముకలు బోలుగా మారి పిల్లలు ఎముకల గూడులా కనిపిస్తుంటారు. విటమిన్ డి లోపిస్తే ఈ సాధారణ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అలసట, కీళ్లలో నొప్పులు, కండరాల బలహీనత, భావోద్వేగాలు మారిపోవడం, కొన్ని సందర్భాల్లో తలనొప్పి కనిపిస్తుంది. రక్తపరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయిలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా విటమిన్ డి మెదడు ఆరోగ్యానికి చాలా కీలకమైంది. మనిషి జ్ఞాపకశక్తిని ఇది ప్రభావితం చేస్తుంది. అంతేకాదు విటమిన్ డి లోపతో నరాల జబ్బులు, మానసిక రుగ్మతలు కూడా తలెత్తుతాయి.
అధ్యయనాలు ఇంకా ఏం చెబుతున్నాయో తెలుసా….విటమిన్ డి ఒక న్యూరోస్టెరాయిడ్ లా పనిచేస్తుందట. మెదడుకు తగినంతగా విటమిన్ డి లేనట్లయితే మల్టీపుల్ స్ల్కిరోసిస్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇక విటమిన్ డి లోపంతో డిప్రెషన్ కూడా సంభవిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. టైప్ 2 మధుమేహంతో బాధపడే మహిళల్లో కూడా తరచుగా వారి భావోద్వేగాల్లో మార్పులకు ఈ విటమిన్ డి తగ్గిపోవడమే కారణమని తెలుసుకున్నారు.
సాల్మన్, మాక్రెల్, హెర్రింగ్స్ వంటి చేపలు, రెడ్ మీట్, లివర్, గుడ్డు, పాలు, జున్ను, పుట్టగొడుగులు, బాదం పప్ప్పుులు, ఆరెంజ్, ఓట్స్ సోయా బీన్స్ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్ డి పుష్కలంగా లభ్యం అవుతుంది.