Amla: ఉసిరికాయ మంచిదే కానీ వీరికి మాత్రం చాలా డేంజర్.. తిన్నారో ఇంక అంతే సంగతులు!
Amla: ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు తినడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 08:00 AM, Fri - 17 October 25

Amla: ఉసిరికాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉసిరికాయను ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ సి తో పాటు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ గా ఉసిరి తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరికాయను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఉసిరికాయ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డయాబెటిస్ ఉన్నవారికి ఉసిరికాయ మంచిదే కానీ, ఇప్పటికే హైపోగ్లైసేమియాతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం వీలైనంత వరకూ ఉసిరికాయను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.కాగా ఆమ్లాలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అదే సమయంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా అడ్డుకుంటాయట. ఉసిరి అనేది డయాబెటిక్ పేషెంట్స్ కి మంచిదే అయినా ఇప్పటికే లో షుగర్ లెవెల్స్ తో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రం ఇది కాస్త ప్రమాదకరం కావచ్చని చెబుతున్నారు. సాధారణంగా ఉసిరికాయ కాస్త పుల్లగా ఉంటుంది. కాబట్టి అసిడిటీతో ఇబ్బంది పడుతున్నవారు మాత్రం ఉసిరి కాస్త హాని చేసే అవకాశముందట.
ఇప్పటికే అసిడిటీ ఉన్న వారికి ఉసిరిలోని అసిడిక్ గుణాలు తోడైతే ఇంకాస్త ఎక్కువగా ఇబ్బంది పెడుతుందట. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు ఉన్న వాళ్లు, యాసిడ్ రిఫ్లక్స్ తో ఇబ్బందులు పడుతున్న వారు, పేగు పూతతో అవస్థలు పడుతున్న వారు వీలైనంత వరకూ ఉసిరికాయను అవాయిడ్ చేయడమే మంచిదని చెబుతున్నారు. అయితే ఇప్పటికే రక్తం పల్చబడడానికి మెడిసిన్ తీసుకుంటున్న వారు మాత్రం వీలైనంత వరకూ ఉసిరికాయను తినకపోవడమే మంచిదని, ఆస్పిరిన్, వార్ఫరిన్ లాంటి మందులు వేసుకుంటున్న వాళ్లు అసలు ఉసిరి తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీని వల్ల రక్తం ఇంకా పల్చగా మారిపోయే ప్రమాదం ఉంటుందట. అంతే కాదు బ్లీడింగ్ అయ్యే ముప్పు కూడా ఉంటుందని, ఉసిరి తినడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ పై ప్రభావం పడడంతో పాటు కొన్ని సార్లు బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయట. ఉసిరి కాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ శరీరంలో ఆక్సలేట్ గా మారుతుందట. సాధారణంగా వీటి మోతాదు పెరిగినప్పుడు క్రమంగా ఇవి క్రిస్టల్స్ గా మారిపోతాయని చెబుతున్నారు. ఈ క్రిస్టల్స్ కిడ్నీలలో వచ్చి చేరుకుంటాయట. వీటినే కిడ్నీలలో రాళ్లు రావడం అంటారు. క్యాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ గా మారిపోతాయి. మిగతా వారిలో మరీ ఇంత ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికే కిడ్నీలో సమస్యలు, రాళ్లు లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉసిరి కాయలు తింటే మాత్రం రిస్క్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.