Electronic Gadgets: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించేవారు కళ్ళు మంటగా నొప్పిగా అనిపించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు..
- Author : Anshu
Date : 28-11-2024 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారు. కొందరు అయితే రోజులో కొన్ని గంటల తరబడి మొబైల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ జనరేషన్ పిల్లలకు కూడా మొబైల్ ఫోన్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఒక వయసు వచ్చేసరికి మొబైల్ ఫోన్లకు విపరీతంగా ఎడిట్ అవుతున్నారు. మొబైల్ ఫోన్లు లాప్టాప్ లు ట్యాబ్లు వంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి.
కనీసం 20 ఏళ్లు కూడా నిండకముందే అప్పుడు చిన్నపిల్లలకు కూడా కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. అందులోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను మితిమీరి వాడటం వల్ల కళ్ళు మరింత బలహీన పడతాయి. మరి అలాంటప్పుడు కళ్ళను ఏ విధంగా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకు రోజు వాటర్ ఎంతో బాగా ఉపయోగపడతాయట. రోజ్ వాటర్ కంటి నొప్పిని,చికాకుని తగ్గించడానికి సహాయపడుతుందట. ఇందుకోసం రెండు మూడు చుక్కల రోజ్ వాటర్ ని కళ్లలో వేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కళ్ళల్లో దురద సమస్యకు కూడా రోజు వాటర్ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే కీర దోసకాయలు బంగాళదుంపలు కూడా కంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయట. కళ్ళు మంటగా అనిపించినప్పుడు కీరదోస ముక్కలు కట్ చేసి ఫ్రిజ్లో 20 నిమిషాలు పెట్టి ఆ తర్వాత కీరా ముక్కలను కళ్ళపై పెట్టుకోవాలనీ చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల కంటినొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుందట. అలాగే ఎక్కువసేపు లాప్టాప్ ముందు ఉండకుండా ప్రతి గంటకి ఒకసారి బయటికి వచ్చి ప్రకృతిని, పచ్చదనాన్ని కాసేపు చూడాలట. అలా చేయటం వల్ల కంటికి రిలాక్సేషన్ కూడా కలుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించేవారు తప్పకుండా వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల కళ్లద్దాలను ఉపయోగించాలని చెబుతున్నారు. పైన చెప్పిన రెమెడీస్ కేవలం తాత్కాలిక మాత్రమే. కళ్ళు విపరీతంగా నొప్పించి మంటగా అనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు..