Sleep: నిద్రపోవడానికి ముందు అలాంటి పనులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?
నిద్ర వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కంటి నిండా సరిగా నిద్రపోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తల
- By Nakshatra Published Date - 08:30 PM, Fri - 30 June 23
నిద్ర వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కంటి నిండా సరిగా నిద్రపోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందుకే వైద్యులు శరీరానికి తగినంత శ్రమ అవసరం అని అంటూ ఉంటారు. రాత్రి సమయంలో తొందరగా పడుకొని నిద్ర పోవడం వల్ల ఉదయాన్నే ఎంతో ఎనర్జిటిక్ గా ఫ్రెష్ గా ఉంటారు. ఎంతమందికి అలా పడుకోగానే నిద్ర వస్తే ఇంకొంచం మంది పడుకోవడానికి చిన్నపాటి యుద్ధమే చేయాలని చెప్పవచ్చు. బెడ్‌పై అటు ఇటు దొర్లుతూ దొర్లుతూ ఎప్పటికో కానీ నిద్రలోకి జారుకోరు. అయితే నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి.
అలాగే నిద్రపోయే ముందు కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. మరి ఎటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం..చాలామంది రాత్రి సమయంలో బెడ్ పై పడుకొని మొబైల్, ల్యాప్‌టాప్ చూస్తూ ఉంటారు. దాని వల్ల . మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్ల నుండి బ్లూ లైట్ వెలువడుతుంది. ఈ బ్లూ లైట్ వల్ల నిద్ర మబ్బు పోతుంది. డిజిటల్ స్క్రీన్ల నుండి వెలువడే నీలం, తెలుపు కాంతి మెదడును మెలటోనిన్ విడుదల చేయకుండా అడ్డుకుంటుంది. ఇది మీరు సరైన సమయానికి నిద్రపోకుండా చేస్తుంది. ఈ హార్మోన్ లేనప్పుడు, వ్యక్తి నిద్రపోవడం కష్టంగా మారుతుంది. రాత్రిపూట నీలి కాంతికి గురికావడం వల్ల నిద్ర ప్రభావం అవుతుంది. స్థూలకాయం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
రాత్రి పూట బ్లూ లైట్ వల్ల రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే నైట్ డ్యూటీ చేసే వారికి కాఫీ, టీ బెస్ట్ ఫ్రెండ్స్ వంటివి. అయితే నిద్ర పోవాలనుకునే వారికి ఇవి ఏమంత మంచివి కావు. కాఫీ లేదా టీ తాగడం వల్ల ఇందులో ఉండే కెఫీన్ శరీరంలోని అడ్రినలిన్ శక్తి స్థాయిలను పెంచుతుంది. ఇది నిద్ర పోకుండా చేస్తుంది. కెఫిన్ మెదడు ద్వారా ఉత్పత్తి చేయబడిన అడెనోటిస్ అనే రసాయనాన్ని కూడా అడ్డుకుంటుంది. ఇది మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తుంది. కెఫిన్ నిద్రపోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.
ఒకవేళ నిద్ర పట్టినా మధ్య మధ్యలో మెలకువ వచ్చేలా చేస్తుంది. చాలా మండి లేట్ నైట్ భోజనం చేస్తుంటారు. మరికొందరు నిద్రపోయే ముందు అల్పాహారం చేస్తుంటారు. అయితే ఈ అలవాట్ల వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. కొవ్వు పదార్థాలు లేదా అర్ధరాత్రి స్నాక్స్ తినడం నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పడుకునే ముందు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల REM నిద్రలో గడిపే సమయాన్ని తగ్గించవచ్చు. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ధూమపానం కారణం అవుతుంది. కొంత మందికి భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగడం అలవాటు ఉంటుంది. అలా రాత్రి సమయంలోనూ భోజనం తర్వాత సిగరెట్ తాగితే త్వరగా నిద్ర పట్టదు. గంటల తరబడి మెలకువగా ఉంచుతుంది. రాత్రి సమయంలో స్మోకింగ్ చేయడం వల్ల నిద్రలేమి సమస్యల వస్తుంది.
Related News
Hyderabad: పెట్రోలింగ్ డ్యూటీలో నిద్రపోతూ అడ్డంగా బుక్కైన పోలీస్…
పెట్రోలింగ్ డ్యూటీలో లో ఉన్న ఓ పోలీస్ అధికారి ప్రభుత్వ వాహనంలో నిద్రపోతూ కెమెరాకు చిక్కాడు. డ్యూటీ చేయాల్సిన పోలీసులు వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేసి రిలాక్స్ అవ్వడంపై పై అధికారులు యాక్షన్ తీసుకున్నారు.