Mustard Seeds: ఆవాలు తింటే ఇన్ని రకాల ప్రయోజనాలా.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఆవాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని, ఆవాలు తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:33 PM, Fri - 10 January 25

మాములుగా మనం ఎలాంటి కూరలు చేసినా కూడా అందులో తిరువాత వేస్తూ ఉంటాము. అయితే అప్పుడు తప్పకుండా ఆవాలు ఉపయోగిస్తూ ఉంటాము. పోపు దినుసుల్లో ఒకటై ఆవాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కూరకు రుచిని పెంచడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ఆవాల్లోని గొప్ప గుణాలు అనేక రకాల సమస్యలను దూరం చేస్తాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్ అవుతుంది. అంతే కాకుండా శరీరంలో గుడ్ కొలస్ట్రాల్ కూడా పెరుగుతుందట.
వీటన్నింటి కారణంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందట. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. ఆవాలు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయట. వీటిని తగ్గించడంలో ఆవాలు ముందుంటాయని చెబుతున్నారు. అందుకే రెగ్యులర్‌గా ఆవాలని తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నా దూరం పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆవాల్లో కొన్ని గుణాలు క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తాయట. దీంతో కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చట. అంతేకాకుండా సోరియాసిస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్, రింగ్ వార్మ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయని చెబుతున్నాయి.
ఆవాల్లో ఫినోలిక్ కాంపౌండ్స్, టోకోఫెరోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి కాలేయ పనితీరుని మెరుగ్గా చేస్తుంది. వీటితో పాటు జీర్ణ సమస్యల్ని కూడా ఆవాలు దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆవాల్లో పొటాషియం, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి, కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, కచ్చితంగా రెగ్యులర్ గా వీటిని మీ డైట్ లో యాడ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఆవాల్లో రిచ్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి మీ స్కిన్ మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుని బలంగా చేస్తాయి. ఆవాల్లోని విటమిన్ ఎ, కె, సిలు.. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయని చెబుతున్నారు.