Joint Pains: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్ తాగాల్సిందే!
కీళ్ల నొప్పులతో సతమతమవుతున్న వారు కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:30 PM, Tue - 13 August 24

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో కీళ్ల నొప్పుల సమస్య ప్రధానంగా ఉంది. ఇదివరకటి రోజుల్లో కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే ఈ కీళ్ల నొప్పులు సమస్యలు వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఈ కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కీళ్ల నొప్పుల కారణంగా నడవడానికి కూర్చోవడానికి కూడా తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి మెడికల్ పరంగా చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు.
కానీ కీళ్ల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు వైద్యులు. మరి కీళ్ల నొప్పుల నుంచి మనం కలిగించే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా కీళ్ల నొప్పులను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఎక్కువగా ఉండే పానీయాలను తాగడం వల్ల కూడా కీళ్ల నొప్పులు కాస్త తగ్గుతాయట. ఆ పానీయాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. సాధారణంగా బరువు తగ్గడానికీ గ్రీన్ టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు.. కానీ ఈ గ్రీన్ టీని తాగితే మీరు బరువు తగ్గడంతో పాటుగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చట.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు , పాలీ ఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయట. ఇవి రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, కీళ్ల వాపును తగ్గించడానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు తాగాల్సిన వారిలో పాలు కూడా ఒకటి. పాలు కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. ఇది మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అందుకే మీరు పాలను తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ మీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది జాయింట్ పెయిన్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు. చెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. చెర్రీ జ్యూస్ ను తాగితే మీ కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయటీ.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.