Breakfast : బ్రేక్ఫాస్ట్ లో తినాల్సిందే ఇవే
Breakfast : సరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలతో తయారైన అల్పాహారం తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి
- By Sudheer Published Date - 10:42 AM, Thu - 27 March 25

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ (Breakfast ) చేయడం శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం లేని ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. చాలామంది నాశ్తాను తేలికపరిచినంత మాత్రాన పొట్ట నింపే ఫుడ్ తీసుకుంటారు. కానీ ఇది శరీరానికి అవసరమైన ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ (Protein, vitamins, minerals) అందించలేకపోతుంది. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ప్రొటీన్, ఫైబర్, ఐరన్ అధికంగా ఉండే చిరుధాన్యాలను నిత్యం బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవాలి.
చిరుధాన్యాలతో బ్రేక్‌ఫాస్ట్ తింటే ఏమి జరుగుతుందంటే?
చిరుధాన్యాలైన రాగి, సామలు, కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి గ్లూటెన్-ఫ్రీగా ఉండటమే కాకుండా, ఫైబర్, ఐరన్, ప్రొటీన్‌లు అధికంగా ఉంటాయి. ఈ ధాన్యాలతో చేసిన ఇడ్లీలు, దోశలు ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌గా మారతాయి. ఇవి తినడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. చిరుధాన్యాలతో తయారైన ఆహారం తింటే శరీరానికి నెమ్మదిగా ఎనర్జీ విడుదల అవుతుంది, తద్వారా ఎక్కువసేపు ఆకలి బాధించదు.
ఈ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
సరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలతో తయారైన అల్పాహారం తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఊబకాయం సమస్యను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. అధిక ఫైబర్ కలిగిన ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజూ పోషకాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తినడం తప్పనిసరి.
Ram Navami 2025: శ్రీరామ నవమి రోజున అయోధ్యలో కార్యక్రమాలివీ..