Rusk : చాయ్ తో రస్క్ తినడం మీకు ఇష్టమా ? రస్క్ లో దాగిన హెల్త్ రిస్క్ గురించి తెలుసుకోండి..
- By Hashtag U Published Date - 07:00 PM, Tue - 3 January 23

చాయ్, రస్క్ ఈ రెండింటి కాంబినేషన్ అదుర్స్.. చాయ్ తో పాటు రస్క్ (Rusk) తినడం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ఎంతో రుచికరమైన రస్క్ మన ఆరోగ్యానికి మంచిదేనా ? నిపుణులు ఏం అంటున్నారు ? ఈవిషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలా తయారు చేస్తారు?
రస్క్ మన ఆరోగ్యానికి మంచిదా ? కాదా? అనేది తెలుసుకోవడానికి ముందు..అది ఎలా తయారు అవుతుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. పిండి, (Gulten) చక్కెర, చౌక నూనెలతో బేకరీల్లో (Bakery) రస్క్ తయారు చేస్తారు. చాలా బేకరీలు అధిక లాభం కోసం చౌక ధరల పిండి, నూనెను (Oil) రస్క్ తయారీకి వాడుతుంటాయి.అలాంటి వాటిని తింటే మన ఆరోగ్యం రిస్క్ లో పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో ఇంకా ఏముంది?
ప్రాసెస్ చేయబడిన గోధుమ/మైదా పిండితో రస్క్ తయారు చేస్తారు. కాబట్టి ఇందులో ఫైబర్ ఉండదు. మీ శరీరానికి రోజువారీ పరిమితికి మించిన స్థాయిలో షుగర్ ను రస్క్ లు అందిస్తాయి. రస్క్ లో రుచి కోసం కొన్ని తేలికపాటి రసాయనాలు కలుపుతారు. రస్క్ షెల్ఫ్ లైఫ్ ను పెంచడానికి ఇంకొన్ని రసాయనాలు కలుపుతారు. ఇవేమిటో తెలుసుకోకుండానే మనం తినేస్తూ ఉంటాం. రస్క్‌కి బ్రౌన్ కలర్ ఇవ్వడానికి కారామెల్ కలర్ లేదా బ్రౌన్ ఫుడ్ కలరింగ్ జోడించబడుతుంది.
రస్క్ తింటే రిస్క్ ఏంటి?
రస్క్ తరచుగా తింటే.. మన బాడీలో గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. జీవక్రియలు దెబ్బతింటాయి. జీర్ణాశయంలో చెడ్డ బ్యాక్టీరియా పెరుగుదలను రస్క్ ప్రోత్సహిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. రస్క్ మీ గట్.. రోగనిరోధక శక్తి.. హార్మోన్ల సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది అని వివరించారు.
ఏ రస్క్ తినాలి?
“మల్టీగ్రెయిన్ రస్క్‌లో మైదా కూడా ఉంటుంది. కాబట్టి, ఎల్లప్పుడూ 100 శాతం హోల్ వీట్ (Whole Wheat) లేదా 100 శాతం సెమోలినా రస్క్ తినండి” అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.