Coconut Water: వేసవికాలంలో కొబ్బరినీరు తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం మంచిదే కానీ తాగే ముందు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:02 PM, Tue - 13 May 25

కొబ్బరి నీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్లు, పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ ను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నీళ్లు చాలా ఆరోగ్యకరమైనవి అని చెబుతున్నారు. కొవ్వు కూడా తక్కువగా ఉంటుందట. అలాగే కొలెస్ట్రాల్ ఉండదట. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయట.
వ్యాయామం తర్వాత లేదా వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి ఒక అద్భుతమైన పానీయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొబ్బరినీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుందట. ముఖ్యంగా రోజుకి రెండు సార్లు కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో రక్తపోటు కంట్రోల్ లో ఉంటుందట. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రిస్తుందట. కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయట. దీని వల్ల రక్తం గడ్డకట్టడం తగ్గుతుందని, గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు. కొబ్బరిలో చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు.
కాగా వేసవిలో కొబ్బరినీళ్లు తాగడం వలన జీవక్రియను కూడా పెంపొందించుకోవచ్చట. అలాగే శరీర అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. కొబ్బరినీటిలో ఉండే పోటాషియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందట. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందట. వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే కొబ్బరి నీరు తప్పకుండా తాగాలని చెబుతున్నారు. కొబ్బరినీరు ఆరోగ్యానికి మంచివే కానీ అలా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. కాబట్టి కొబ్బరి నీరు తాగినప్పుడు మితంగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఉదయం సమయంలో తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు.