Health Tips: ఏంటి.. సోడా తాగితే బట్టతల వస్తుందా.. ఇందులో నిజమెంత?
చాలామంది సోడా తాగితే బట్ట తల వస్తుందని అధికంగా హెయిర్ ఫాల్ అవుతుందని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:00 PM, Sun - 9 March 25

మామూలుగా చాలామంది ఈ వేసవికాలంలో బయట సోడా ఎక్కువగా తాగుతూ ఉంటారు. జింజర్ సోడా నిమ్మకాయ సోడా అంటూ రకరకాల సోడాలు తాగుతూ ఉంటారు. వీటిని తాగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే వీటివల్ల అధికంగా హెయిర్ ఫాల్ అవుతుందని బట్టతల వస్తుందని చాలామంది అంటున్నారు.. ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని రకాల పానీయాలు తాగే అలవాటు ఉన్న పురుషుల జుట్టు రాలడానికి ఎక్కువ అవకాశం ఉందట.
అంతేకాదు వీరి జుట్టు చాలా ఫాస్ట్ గా ఊడిపోతుందట. ఎనర్జీ డ్రింక్స్ లేదా షుగర్ డ్రింక్స్, సోడా తాగేవారికి జుట్టు రాలడం, బట్టతల వచ్చే అవకాశం ఉంటుందట. ఈ ఎనర్జీ డ్రింక్స్ ప్రభావం పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుందట. ముఖ్యంగా 13 నుంచి 29 ఏళ్ల మధ్య వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారట. రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి జుట్టు రాలిపోయే ప్రమాదం 42 శాతం ఎక్కువగా ఉంటుందట..
ఫాస్ట్ ఫుడ్స్ తినే వారు లేదా తక్కువ కూరగాయలు తినే వారికి జుట్టు రాలడమే కాదు వీళ్లు తరచుగా ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా ఉంటుందట. ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్స్ ఊబకాయానికి దారితీస్తాయని చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతాయట. జుట్టు బలహీనంగా ఉంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. జుట్టు రాలడం లేదా బలహీనమైన జుట్టును బలోపేతం చేయడానికి కలబంద జెల్ ను ఉపయోగించాలట. జుట్టు రాలడానికి చుండ్రే ప్రధాన కారణం. అందుకే నిమ్మరసం, పెరుగు ఉపయోగించడం వల్ల ఉపశమనం కలుగుతుందట. సీజన్ తో సంబంధం లేకుండా స్నానం చేసే ముందు నిమ్మ పెరుగు పేస్ట్ ను తలకు అప్లై చేయాలి. జుట్టు ఒత్తుగా ఉంటే మెరిసే, జుట్టు పెరగడానికి గుడ్డు హెయిర్ మాస్క్ ను అప్లై చేయాలి. .