Sugar Free Mangoes : షుగర్ ఫ్రీ మామిడి పండ్ల గురించి మీకు తెలుసా?
రామ్ కిషోర్ సింగ్ అనే ఒక రైతుకు రకరకాల మామిడిపండ్లను పండించడం ఒక హాబీ ఆయన చెక్కర లేని మామిడిపండ్లను పండించాడు.
- By News Desk Published Date - 06:57 PM, Sat - 10 June 23

మామిడి పండు(Mangoes) అనేది ఎండాకాలం(Summer)లో విరివిగా దొరికే పండు. మామిడిపండు అంటే ఇష్టపడని వారు ఉండరు కానీ దీనిని షుగర్ పేషంట్స్(Sugar Patient) తినకూడదు ఎందుకంటే మామిడిపండు ఎక్కువ తియ్యగా ఉంటుంది దాని వలన షుగర్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి. అయితే షుగర్ ఫ్రీ మామిడిపండును షుగర్ ఉన్నవారు ఎవరైనా తినవచ్చు దాని వలన వారి ఆరోగ్యానికి ఎటువంటి హాని జరుగదు. షుగర్ ఫ్రీ మామిడిపండ్ల(Sugar Free Mangoes)ను మన దేశంలో చాలా మంది రైతులు పండిస్తున్నారు.
ముఖ్యంగా రామ్ కిషోర్ సింగ్ అనే ఒక రైతుకు రకరకాల మామిడిపండ్లను పండించడం ఒక హాబీ ఆయన చెక్కర లేని మామిడిపండ్లను పండించాడు. రామ్ కిషోర్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్పూర్ లోని ముషారీ బ్లాక్ లోని బ్రిందాలో నివసిస్తారు. అక్కడే తన తోటలో మాల్దా మామిడిపండ్లను పండిస్తున్నాడు. మాల్దా మామిడిపండు అంటే షుగర్ లేని మామిడిపండు. ఇవి మధుమేహం ఉన్నవారు తినవచ్చు వీటిని తినడం వలన వారి ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదు.
రామ్ కిషోర్ సింగ్ అతని తోటలో పండించిన మామిడిపండును ల్యాబ్ లో పరీక్షించగా మామిడిపండులో షుగర్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ షుగర్ ఫ్రీ మామిడిపండ్లను తినడం వలన మధుమేహం ఉన్నవారి ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదు. అయితే షుగర్ ఫ్రీ మొక్కను పెంచుకోవాలంటే దానిని రామ్ కిషోర్ సింగ్ వద్ద కొనుక్కోవచ్చు అయితే ఆ మొక్క ధర 4000 రూపాయలు. ఈ మామిడి పండ్ల ధరలు కూడా కొద్దిగా ఎక్కువే. రామ్ కిషోర్ సింగ్ రకరకాల మొక్కలు పండించినందుకు పలు సత్కారాలు, అవార్డులు కూడా పొందాడు.
Also Read : Milk-Watermelon: పాలు, పుచ్చకాయ కలిపి తీసుకుంటే అంతే సంగతులు?