Steam Inhalation: ఆవిరి పట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు వాతావరణాన్ని బట్టి తేలికపాటి వ్యాధులకు త్వరగా ప్రభావితం అవుతారు. జలుబు , దగ్గు ,గొంతు నొప్పి వంటి సమస్యలను నిత్యం ఎదుర్కొంటారు.
- By Praveen Aluthuru Published Date - 01:49 PM, Sun - 1 October 23

Steam Inhalation: రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు వాతావరణాన్ని బట్టి తేలికపాటి వ్యాధులకు త్వరగా ప్రభావితం అవుతారు. జలుబు , దగ్గు ,గొంతు నొప్పి వంటి సమస్యలను నిత్యం ఎదుర్కొంటారు. ఈ తరహా సమస్యలు ఎదురైనప్పుడు ఇంగ్లిష్ మందులను వాడుతుంటారు. అయితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఒక్కోసారి ఇంగ్లిష్ మందులకు ప్రభావితం చూపించవు. ఈ సమయంలో ఆవిరి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
1. గొంతు నొప్పి పోతుంది
ఆవిరి పట్టడం వల్ల గొంతు నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఆవిరి పట్టడం వల్ల గొంతు కండరాలు సడలించుకుంటాయి. వేడి లోపలి వెళ్లడం ద్వారా వాపు కూడా తగ్గుతుంది. ఆవిరి తీసుకోవడం రక్తనాళాల సంకోచాన్ని తొలగిస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచి ఉపశమనం కలిగిస్తుంది.
2. మూసుకుపోయిన ముక్కు మరియు శ్వాసనాళం తెరుచుకుంటుంది
వేడి నీటితో ఆవిరి పట్టడం ద్వారా మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుంది. అలాగే గొంతు మరియు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మం వదులుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్య దూరమవుతుంది.
3. నిద్రపై ప్రభావవంతంగా ఉంటుంది
జలుబు మరియు గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు నిద్ర కూడా సరిగా పట్టదు .ఇలాంటి పరిస్థితుల్లో ఆవిరిని తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు తొలగిపోతాయి. శ్వాసకోశం స్పష్టంగా ఉండి, మూసుకుపోయిన ముక్కు సమస్య కూడా దూరమవుతుంది. దీంతో ప్రశాంతమైన నిద్ర సొంతం చేసుకోవచ్చు. స్టీమ్ థెరపీ శరీరానికి కూడా విశ్రాంతినిస్తుంది.
Related News

Health: గొంతునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి
Health: ప్రస్తుతం ఈ సీజన్ లో చాలామంది గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అలాంటివారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల సమస్యకు చెక్ పెట్టొచ్చు. గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి గార్గింగ్ చేస్తే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. వెనిగర్ లేకపోయినా.. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్గింగ్ చేసుకోవచ్చు. ఒక కప్పు నీ