HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Sprouts Side Effects

Sprouts: రోజు మొలకలు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

ప్రతిరోజు మొలకలు తినేవారు వాటి వల్ల కలిగే కొన్ని రకాల ప్రమాదాల గురించి కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు. మరి మొలకలు తింటే ఎలాంటి ప్రమాదం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 10-01-2025 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sprouts
Sprouts

మొలకలు లేదా స్ప్రౌట్స్ తినడం ఈ మధ్యకాలంలో అలవాటుగా మారిపోయింది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిశాక ప్రతి ఒక్కరు కూడా మొలకెత్తిన గింజలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. మొలకల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండి కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయని చెబుతారు. అయితే ఇవి అందరి విషయంలో ఒకే విధంగా పనిచేయవని, కొందరిలో ప్రమాదకరంగానూ మారుతాయని నిపుణులు చెబుతున్నారు. అవునండి మీరు విన్నది నిజమే, మొలకలు అందరికీ మంచి చేయవట.

మొలకలలో విటమిన్ సి, ఫైబర్, జింక్, ఇనుము, కాల్షియం, ఫోలెట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొలకల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గి జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందట. ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకలు వంటి ఆహారాలను తినే వ్యక్తులు మలబద్ధకంతో బాధపడే అవకాశం తక్కువగా ఉందట. మొలకలు తినడం వల్ల అందులో ఉండే ఫైబర్, మరికొన్ని పోషకాలు జీర్ణ సమస్యలను నివారించడంలో చాలా బాగా పనిచేస్తాయట. ఈ మొలకల ద్వారా బాడీలో హెచ్‌డిఎల్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఈ మొలకలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందట. రక్తపోటు కంట్రోల్​లో ఉంటుందట. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని అంటున్నారు.

మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉండే విటమిన్ సి, మరిన్ని పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా బాగా తోడ్పడతాయట. వీటిలో ఉండే విటమిన్ ఏ కంటిశుక్లం, రేచీకటి వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. మొలకలు తినడం వల్ల శరీరానికి విటమిన్ బి లభిస్తుందట. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా స్కిన్​ ని హైడ్రేట్​ గా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే మొలకల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తినడం మంచిది కాదట. ఒక రోజులో గుప్పెడు లోపు తినాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సరైన పద్ధతిలో మొలకలు తయారు చేసుకోవడం చాలా అవసరం. సరిగా శుభ్రం చేయని గింజలతో, గింజల్ని చుట్టే వస్త్రంతో ఫుడ్​ పాయిజన్​ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. నాణ్యత లేని మొలకలు తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. అలాగే వాంతులు, విరేచనాలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందట. మొలకల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు మొలకల తీసుకోవడం గురించి వైద్యుడితో మాట్లాడాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల మొలకల్లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుందట. ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుందని, కాబట్టి రక్తం పలుచగా కావడానికి మందులు వాడే వారికి ఇది సమస్యలు కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating Sprouts
  • health tips
  • Sprouts
  • Sprouts side effects

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd