Banana: అరటిపండు మంచిదే కదా అని ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త?
చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండ్లలో అరటి పండు కూడా ఒకటి. ఈ అరటిపండు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుం
- By Anshu Published Date - 06:00 PM, Thu - 7 December 23

చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండ్లలో అరటి పండు కూడా ఒకటి. ఈ అరటిపండు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అరటి పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధర తక్కువే అయినప్పటికీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.. అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం,ఖనిజాలు, చక్కెర, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు లభిస్తాయి. అయితే అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కదా అని మితిమీరి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. అరటిపండును ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.
మరి అరటి పండ్లను తినడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.. అరటి పండ్లను తినడం మంచిదే కానీ రోజుకు రెండు కంటే ఎక్కువ అరటి పండ్లు తీసుకుంటే వేగంగా బరువు పెరుగుతారు. అరటిపండ్లలో పొటాషియం పరిమాణం అధికంగా ఉంటుంది. అయితే ఈ పొటాషియం శరీరానికి కావాల్సిన దానికంటే అధికంగా లభిస్తే వాంతులు, విరేచనాలు మైకం పంటి సమస్యలు తరుత్తుతాయి. కొన్ని కొన్ని సమయాల్లో గుండెపోటుకు కూడా కారణం కావచ్చు. ఎక్కువగా అరటి పండ్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను అతిగా తీసుకోకూడదు.
పచ్చి అరటిపండ్లలో స్టార్చ్ అధిక పరిమాణంలో ఉంటాయి. దీని నిత్యం తీసుకుంటే కడుపునొప్పి, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అరటిలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే నరాలు దెబ్బతింటాయి. బాడీ బిల్డింగ్ కోసం అరటి పండ్లు అధికంగా తినేవాళ్ళకి ఈ సమస్య వస్తుంది. అరటిపళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు కానీ పండ్లను కానీ ఎక్కువగా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.