HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Smoking Habits Can Also Increase Risk Of Eye Disease

Smoking: స్మోకింగ్ చేస్తున్నారా.. అయితే చూపు కోల్పోవడం ఖాయం!

కంటి చూపు కోల్పోకుండా ఉండాలి అంటే స్మోకింగ్ చేయడం అలాగే స్మోకింగ్ చేసే వారికి రెండింటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.

  • By Anshu Published Date - 10:30 AM, Thu - 1 August 24
  • daily-hunt
Mixcollage 01 Aug 2024 11 33 Am 6456
Mixcollage 01 Aug 2024 11 33 Am 6456

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనం తరచూ సినిమాలలో, సీరియల్స్ లో పేపర్స్ లో, బయట అడ్వర్టైజ్మెంట్ లలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సిగరెట్ ప్యాక్ ల మీదే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటారు. అయితే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా చాలామంది తాగడం మాత్రం మానుకోరు. ఈ మధ్యకాలంలో అయితే చిన్న పిల్లలు కూడా ధూమపానానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. కనీసం 15 ఏళ్లు కూడా పూర్తిగా నిండకముందే చిన్న పిల్లలు కూడా సిగరెట్లు తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే స్మోకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. స్మోకింగ్ చేస్తే అది కంటి ఆరోగ్యం పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. స్మోకింగ్‌ కారణంగా కంటి ఆరోగ్యంపైనా ఎఫెక్ట్‌ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్‌, దృష్టి లోపానికి మధ్య ఉన్న సంబంధం ఆందోళన కలిగించే విషయం అని అంటున్నారు. మన ఆరోగ్య శ్రేయస్సు కోసం ధూమపానానికి మొత్తం దూరంగా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. కేవలం స్మోకింగ్ చేసే వారికి మాత్రమే కాకుండా ఆ పొగ పీల్చే వారికి కూడా కళ్ళపై హానికరమైన ప్రభావాలు పడతాయట. అందుకే ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉండకపోవడమే మంచిది అని చెబుతున్నారు.

తరచూ స్మోకింగ్ చేయడం వల్ల అది దృష్టి సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుందట. స్మోకింగ్‌ చేసేవారిలో వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ వల్ల కంటి శుక్లాలు వచ్చే ప్రమాదాన్ని పెరుగుతుందట. ఈ సమస్య ఉంటే కంటి గుడ్డులో మబ్బుగా కన్పించడం, అస్పష్టమైన దృష్టి , ఒక వస్తువు రెండుగా కన్పించడం, కంటిలో తెల్లగా కన్పించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. స్మోకింగ్‌ చేయనివారితో పోలిస్తే స్మోకింగ్‌ చేసేవారిలో కంటిశుక్లాలు వచ్చే అవకాశం రెండు నుంచి మూడ రెట్లు ఎక్కువగా ఉంటుందట. కంటిశుక్లం కాకుండా కాంట్రాస్ట్ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుందట. రాత్రిపూట చూపు సరిగ్గా ఉండదట. స్మోకింగ్‌కు దూరంగా ఉంటే కంటిశుక్లం వచ్చే ముప్పును తగ్గించవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇకమీదటనైనా స్మోకింగ్ అలవాటుని మానుకోవడం మంచిది. మరి ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు లేని వారు పక్కన ఎవరైనా స్మోక్ చేస్తుంటే పక్కకు వెళ్లిపోవడం వీలైనంత దూరంగా ఉండటం మంచిది. స్మోకింగ్ పీల్చడం అన్నది తాగడంతో సమానమే అంటున్నారు వైద్యులు.

note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eye disease
  • smoking
  • Smoking and eye disease
  • smoking habits

Related News

Tea With Smoking

Health Tips : మీకు టీ తాగుతూ సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే.. ఇది మీ కోసమే..!

Health Tips : కొంతమందికి ధూమపానం కూడా ఇష్టం. వారు ఉంగరపు వేలుపై సిగరెట్ పట్టుకుని స్టైల్‌గా ఊపిరి పీల్చుకుంటారు. మరికొందరు ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని మరో చేతిలో టీ తాగుతారు. అతిగా ధూమపానం చేయడం వారి ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ, వారు ఆ అలవాటును మానుకోలేకపోతున్నారు.

    Latest News

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd