Sleep: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం.. ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్ లో ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు వారి ఆరోగ్యాలపై కూడా సరిగ్గా దృష్టి పెట్టడం లేదు.
- By Nakshatra Published Date - 06:00 PM, Mon - 4 July 22
ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్ లో ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు వారి ఆరోగ్యాలపై కూడా సరిగ్గా దృష్టి పెట్టడం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో సంపాదన పై దృష్టి పెట్టి వారి ఆరోగ్యాలను చేజేతులని నాశనం చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా చాలామంది నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీనితో ఈ మధ్యకాలంలో గుండె వైఫల్యాలు పెరుగుతు ఉన్నాయి. ఒకవైపు ఒరుగుల పరుగుల జీవితం మరొకవైపు స్మార్ట్ ఫోన్ ఈ రెండిటి వల్ల నిద్ర సమయం తగ్గుతున్నట్టు ఎన్నో అధ్యయనాలు తెలిపాయి.
చాలామంది కుటుంబాన్ని పోషించుకోవడం కోసం సరిగా నిద్ర కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అలా నేటి కాలంలో కంటినిండా నిద్రించే భాగ్యం ఏ కొద్ది మందితో మాత్రమే ఉంటుంది. అయితే అవసరాలు, కారణాలు ఏవైనాప్పటికీ మన గుండె పగలంగా ఉండాలి అంటే తగినంత నిద్ర పోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిద్ర సమయాన్ని కార్డియో వాస్కులర్ హెల్త్ చెక్ లిస్ట్ లో చేరింది. గతంలో ఏడు అంశాలతో కూడిన జాబితాను ఎనిమిదికి పెంచిన విషయం తెలిసింది.
అలా గడిచిన దశాబ్దాల కాలంలో వైద్యులు రోగుల వైపు నుంచి పరిశీలించిన అంశాలు అధ్యయనాల్లో వెళ్లడైన అంశాల ఆధారంగా నిద్ర సమయాన్ని కూడా చెక్ లిస్టులో చేర్చారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు,స్థూలకాయం, మధుమేహానికి దారితీస్తుంది గాని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మూడింటిలో ఏది వచ్చినా కూడా అది గుండె ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది అని తెలిపారు. ఇక రోజుల్లో ఎన్ని గంటలు నిద్రపోవాలి అన్న విషయానికి వస్తే.. పెద్దలు రోజులో కనీసం ఏడు నుంచి 9 గంటల పాటు నిద్రించాలని వైద్యులు సూచించారు. మంచి మంచి లాభాలు పొందాలి అంటే నాణ్యమైన నిద్ర అవసరమని పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజ్ దాస్ గుప్తా వెల్లడించారు.
నిద్రలో ఆర్ఈఎం, నాన్ ఆర్ ఈ ఎం అనే సైకిల్స్ ఉంటాయని, ఈ నాన్ ఆర్ ఈఎంలో మూడో దశలో గాడిని వెళ్తారని అప్పుడే చేయడం మానసికంగా శారీరకంగా పునరుద్దానం చెందుతుంది అని తెలిపారు. సరిగా నిద్రపోకపోవడం వల్ల అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్ దారి తీస్తుందని అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని బలహీనపరిచి గుండె వైఫల్యానికి దారితీస్తాయి అని డాక్టర్ తెలిపారు.
Related News
Benefits Of Makhana: మఖానా తింటే ఈ సమస్యలన్నీ దెబ్బకు పరార్..!
డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే మఖానా కూడా ఆరోగ్యానికి నిధి. మఖానా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.