Breakfast : బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?
Breakfast : కొందరు రాత్రి ఎక్కువగా తిన్నారని, ఇంకొందరు బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో టిఫిన్ మానేస్తారు. కానీ ఇది శరీరానికి, ముఖ్యంగా మెదడుకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది
- By Sudheer Published Date - 08:48 AM, Fri - 19 September 25

మన ఆరోగ్యానికి బ్రేక్‌ఫాస్ట్ (Breakfast ) చాలా ముఖ్యమైన భోజనం. రాత్రంతా ఉపవాసం చేసిన తర్వాత ఉదయం మన శరీరానికి అవసరమైన శక్తిని అందించే ఆహారం అదే. అయితే, చాలామంది వివిధ కారణాలతో దీన్ని స్కిప్ చేస్తున్నారు. కొందరు రాత్రి ఎక్కువగా తిన్నారని, ఇంకొందరు బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో టిఫిన్ మానేస్తారు. కానీ ఇది శరీరానికి, ముఖ్యంగా మెదడుకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఉదయం ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ సరఫరా తగ్గిపోతుంది. దాంతో ఏకాగ్రత లోపం, అలసట, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి.
Breakfast Items: కిడ్నీలకు హానికరమైన అల్పాహారాలు ఇవే.. ఈ లిస్ట్‌లో ఏమున్నాయంటే?
బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయడం వలన కేవలం ఏకాగ్రతే కాదు, జీర్ణక్రియపైనా ప్రభావం చూపుతుంది. అజీర్తి, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. ఆహారాన్ని మానేస్తే శరీరం తర్వాతి మీల్‌లో ఎక్కువగా తినే అలవాటు పడుతుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది. ఇక దీర్ఘకాలంలో హృద్రోగాలు, షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల ఉదయం ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. తేలికగా అయినా శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా టిఫిన్ తీసుకోవడం తప్పనిసరి.
ఇటీవల మాంచెస్టర్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేయడం వల్ల కూడా మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆ అధ్యయనం ప్రకారం, ఉదయం ఆహారం ఆలస్యం చేసే వారి ఆయుష్షు 8-10 శాతం తగ్గిపోతుందని తేలింది. అంటే సమయానికి టిఫిన్ చేయకపోవడం కూడా ప్రాణాంతకమయ్యే అవకాశముంది. కాబట్టి ఉదయం లేవగానే ఒక గంటలోపే తేలికపాటి కానీ పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.