HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Side Effects Of Using Mobile At Night On Health

Health Tips: రాత్రిళ్ళు ఫోన్ ఎక్కువగా వాడితే అలాంటి రోగాలు వస్తాయని మీకు తెలుసా?

రాత్రి సమయంలో ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే సమస్యల గురించి తెలిపారు.

  • Author : Anshu Date : 12-09-2024 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నారు. అలాగే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గంటలకు స్మార్ట్ ఫోన్ ల తోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. దీంతో చాలామందికి కంటికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా ఉదయం నుంచి రాత్రి అర్ధరాత్రి అయినా కూడా మొబైల్ ఫోన్ ని వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ను ఎక్కువగా చూస్తుంటారు.

వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఇలా రకరకాల యాప్స్ ని వినియోగిస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రాత్రిళ్ళు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ని వినియోగించడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి రాత్రిళ్లు ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫోన్ లైట్ నుంచి వచ్చే బ్లూ లైట్ లైట్ మీ కళ్ళను దెబ్బతీస్తుంది. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల రాత్రి సమయంలో త్వరగా నిద్ర పట్టదు. మీ నిద్ర కూడా దెబ్బతింటుంది. దాంతో ఆరోగ్యంగా ఉండే జీవితం మొత్తం గజిబిజిగా మారీ ఒత్తిడిగా మారుతుంది. అలాగే రాత్రి సమయంలో ఎక్కువ ఆలస్యంగా పడుకోవడం వల్ల ఉదయాన్నే లేవడానికి కాస్త బద్ధకిస్తారు.

ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేస్తూ కాసేపు మొబైల్ పనిచేయకపోతే మీరు పడే కంగారు అంతా ఇంతా కాదు. దీనితో మీలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మీ చేతులు, భుజం కండరాలపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నడుము పై అధిక ప్రభావం పడుతుంది. అయితే ఫోన్ ఉపయోగించడం వల్ల అలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఉపయోగించడం కోసం ఒక సమయాన్ని సెట్ చేసుకోవాలి. ఒక సమయం నుంచి ఒక సమయం వరకు మాత్రమే మొబైల్ ని చూడాలని అనుకోవాలి. అంటే రాత్రి 10 దాటిన తర్వాత నెట్ ఆఫ్ చేయడం వల్ల మొబైల్ కి ఎటువంటి నోటిఫికేషన్ కూడా రావు. దీనివల్ల మీకు ఒకటి లేదా రెండు వారాలు కష్టంగా రోజులు గడుస్తాయి. మీ మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. చేతులు ఖాళీగా కూడా అనిపిస్తాయి. కానీ ఇది అలవాటైన తర్వాత మీరు ఎంతో ప్రశాంతంగా, తొందరగా నిద్రపోతారు.

దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. నోటిఫికేషన్ల వల్లే చాలా మంది ఫోన్ ను అతిగా వాడుతారు. మొబైల్ లో మెసేజ్ టోన్ మోగగానే ఏమోచ్చందని వెంటనే చెక్ చేస్తారు. దాన్ని చూడాలనే ఇష్టం మీకు లేకపోయినా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు. అందుకే నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం మంచిది. అలాగే అనవసరమైన సోషల్ మీడియా యాప్స్ ని డిలీట్ చేయడం మంచిది. ముఖ్యంగా నైట్ టైమ్ మొబైల్ చూస్తున్నప్పుడు చాలా వరకు బ్రైట్ నెస్ ని తగ్గించుకోవడం మంచిది. దీంతో మీ కళ్లపై ఎక్కువ ప్రభావం పడదు. అలాగే పడుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Mobile Use
  • night
  • use too much mobile

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

  • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

  • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd