Rusk With Tea: టీలో రస్క్ బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
టీ తాగేటప్పుడు వాటిలో రస్క్ బిస్కెట్స్ ని నంచుకుని తినడం అంత మంచిది కాదని, అది ఆరోగ్యానికి ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Thu - 6 February 25

చాలామందికి టీ తాగేటప్పుడు బిస్కెట్స్ లేదా బ్రెడ్ కలిపి తినడం అలవాటు. కొంతమంది టీ లో రస్క్ బిస్కెట్స్ నంచుకుని తింటూ ఉంటారు. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయని వీటిని ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే టీ రస్క్ బిస్కెట్స్ కాంబినేషన్ అంత మంచిది కాదని ఇది అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మరి టీ తో పాటు రస్క్ బిస్కెట్స్ కలిపి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి టీ లేదా కాఫీతో రస్క్ తీసుకోవడం చాలా మందికి రోజువారీ అలవాటు.
ఇది జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట. చక్కెర, గ్లూటెన్ తరచుగా రస్క్ లలో కలుపుతారు. కాబట్టి టీతో కలిపి రస్క్ తింటే టీ లోని చక్కెర శరీరానికి అందుతుందట. అలాగే ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. ఇది క్రమంగా జీవక్రియ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. టీలో కలిపిన చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చక్కెర స్థాయిల పెరుగుదల ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుందట. అలాగే రస్క్ ల తయారీలో చక్కెరను ఉపయోగించడం, టీలో చక్కెరను కలపడం వల్ల, చక్కెర స్థాయిల పెరుగుదల ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. రస్క్ లను ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వస్తాయట..కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు రస్క్ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.
రస్క్ లో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది కాదట. శరీరానికి జీర్ణం కావడం కష్టమవుతుంది. కాగా ఉదరకుహర వ్యాధి ఉన్నవారు రస్క్ లు తినడం మానేయాలి. ఎందుకంటే ఇది కొన్నిసార్లు వాపు, నొప్పి, విరేచనాలకు కారణమవుతుందట. అసౌకర్యాన్ని పెంచుతుందట. అధిక కార్బోహైడ్రేట్ పాలు, టీతో రస్క్ లను తినడం వల్ల మీ క్యాలరీల సంఖ్య పెరుగుతుందట. ఇది మీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. జీర్ణక్రియ, గ్యాస్ట్రిక్ సమస్యలు రస్క్ లలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, గ్యాస్ట్రిక్ సమస్యలకు మరింత దారితీస్తుందట. అక్కగా ఉదయం పూట పిల్లలకు రస్క్ ఇవ్వడం వల్ల వారికి ఆకలి వేయదు. ఎందుకంటే రస్క్ లో చక్కెర, గ్లూటెన్ మొత్తం మీకు ఆకలి వేయకుండా చేస్తుందట. ఇది పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.