HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Side Effects Of Eating Onions And Curd Together

Onion-Curd: పెరుగులో ఉల్లిపాయ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

చాలామంది పెరుగుతో పాటు ఉల్లిపాయను కూడా కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తినడం మంచిదేనా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 14-05-2025 - 4:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Onion Curd
Onion Curd

మనలో చాలామంది ఫుడ్ లో కొన్ని రకాల కాంబినేషన్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో పెరుగు ఉల్లిపాయ కాంబినేషన్ కూడా ఒకటి. చాలామంది పెరుగన్నం తిన్నప్పుడు నంజుకోవడానికి ఉల్లిపాయ తింటూ ఉంటారు. ఇంకొందరు నాన్ వెజ్ చేసినప్పుడు పెరుగు పచ్చడి అని చెప్పి దోసకాయ, ఉల్లిపాయ అన్ని కలిపి చేస్తూ ఉంటారు. ఈ విధంగా పెరుగు తీసుకున్నప్పుడు చాలామంది ఉల్లిపాయ కూడా తింటూ ఉంటారు. అయితే నిజానికి పెరుగుతో పాటు ఉల్లిపాయ కలిపి తినడం మంచిదేనా? ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగు, ఉల్లిపాయ కలిపి అస్సలు తినకూడదట.

ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ముఖ్యంగా జీర్ణ సంబందిత సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇప్పటికే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పెరుగు ఉల్లిపాయ కలిపి తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లిపాయ, పెరుగు రెండూ విభిన్న ప్రభావాన్ని కలిగి ఉంటాయట. అంటే ఉల్లిపాయ వేడిచేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పెరుగు చలువ చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని కలిపి తినక పోవడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఉండే సమ్మేళనాలు మనకు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చేలా చేస్తాయట.

ఇకపోతే పెరుగులో ఉండే సమ్మేళనాలు కూడా ఇంచుమించు ఇదే ప్రభావాన్నిచూపిస్తుందని, ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ రెండింటినీ కలిపి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ తో పాటుగా అజీర్ణ సమస్యల బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే పెరుగులో చలువ చేసే లక్షణాలు ఉంటాయి. ఉల్లి సల్ఫర్ కంటెంట్ వల్ల వేడి స్వభావాన్ని కలిగి ఉంటుందట. మీరు పెరుగును, ఉల్లిపాయను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుందట. ఇది టాక్సిన్స్ లెవెల్ ను పెంచుతుందట. దీంతో మీ చర్మంపై దద్దుర్లు, తామర, సోరియాసిస్ తో పాటగుా ఇతర చర్మ అలెర్జీలు కూడా వస్తాయి అని చెబుతున్నారు. పెరుగు, ఉల్లిపాయను కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయట. ఎందుకంటే పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి.

ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి అని చెబుతున్నారు. అదేవిధంగా పెరుగులో ఉల్లిపాయలు కలిపి తీసుకుంట హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మీ శరీరంలో అదనపు వేడిని ఉత్పత్తి అవుతుందట. ఇది మీ శరీరంలో టాక్సిన్స్ స్థాయిని పెంచుతుందని చెబుతున్నారు. ఇది తామర, దద్దుర్లతో పాటుగా కొన్ని కొన్ని సార్లు సోరియాసిస్ వంటి చర్మ అలెర్జీలకు కూడా దారితీస్తుందట. దీని పర్యావసానం ఎక్కువగా ఉంటే ఫుడ్ పాయిజనింగ్ బారిన కూడా పడవచ్చు అని చెబుతున్నారు. ఉల్లిపాయలను వేయిస్తే వాటిలోని సామర్థ్యం తగ్గుతుందట. కాబట్టి మీరు ఉల్లిపాయల్ని వేయించి పెరుగులో కలిపి తినవచ్చు అని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • curd
  • health tips
  • Onion-Curd
  • onions

Related News

    Latest News

    • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

    • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

    • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

    • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd