Cardiac Arrest And Precaution:కార్డియాక్ అరెస్ట్” తో కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఉపద్రవం!!
బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఇక లేరు. ఆగస్టు 10న జిమ్ చేస్తుండగా ఆయనకు ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ జరిగింది. దీంతో హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
- By Hashtag U Published Date - 06:00 PM, Wed - 21 September 22

బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఇక లేరు. ఆగస్టు 10న జిమ్ చేస్తుండగా ఆయనకు ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ జరిగింది. దీంతో హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్‌పై దాదాపు 41 రోజులుగా చికిత్స పొందుతున్న 58 ఏళ్ల శ్రీవాస్తవ.. ఇవాల ఉదయం తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తూ.. పౌష్టికాహారం తీసుకునే రాజు శ్రీవాస్తవ ఆకస్మిక మరణం అందరిని కలచి వేసింది. ఈనేపథ్యంలో కార్డియాక్ అరెస్ట్ పై సర్వత్రా చర్చ మొదలైంది. దానిపై ప్రత్యేక కథనం ఇది..
కార్డియాక్ అరెస్ట్ అంటే?
కార్డియాక్ అరెస్ట్ అనేది ఆకస్మికంగా వస్తుంది. దానికి సంబంధించిన ముందస్తు లక్షణాలు కూడా శరీరంలో కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి ఫలితంగా హృదయ స్పందనలో.. అంటే గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతింటుంది.దీని వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. దాంతో మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది. ఫలితంగా కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది.గుండెలో ఎలెక్ట్రికల్ సిగ్నల్స్‌లో తలెత్తిన లోపం కారణంగా శరీర భాగాలకు రక్త సరఫరా జరగక పోవడంతో అది కార్డియాక్ అరెస్ట్‌గా మారుతుంది. శరీరం రక్తాన్ని పంప్ చెయ్యడం మానెయ్యగానే మెదడులో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది.అలా జరిగినప్పుడు మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. శ్వాస ప్రక్రియ ఆగిపోతుంది.కార్డియాక్ అరెస్ట్‌కు సరైన సమయంలో, సరైన చికిత్స లభించనట్టయితే రోగి కొద్ది సెకన్లలో లేదా నిమిషాల్లో మరణిస్తాడు.
లక్షణాలు..
* చెమటలు
సాధారణంగా గుండె నొప్పి ధమనులు మూసుకున్నప్పుడు రక్తాన్ని మీ శరీరంలో ప్రవహించే సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో శరీరం కష్టపడుతుంది. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి శరీరానికి చెమట పడుతుంది. కాబట్టి మీరు ఉదయం లేవగానే, అర్ధరాత్రిలో చల్లగా చెమటలు, శరీరం చల్లగా మారినట్లు అనిపిస్తే మీ డాక్టర్‌ని సంప్రదించండి.
* జీర్ణ సమస్యలు
కార్డియాక్ అరెస్ట్ జరిగే ముందు అన్నం జీర్ణం సరిగ్గా అవ్వదు. అలాంటప్పుడు ఏవేవో ట్యాబ్లెట్స్ తీసుకోవడమే కాదు, డాక్టర్‌ని కలవడం చాలా ముఖ్యం. వృద్ధుల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గుండెల్లో మంటగానూ ఉంటుంది.
* వాంతులు
కడుపునొప్పితో పాటు వికారంగా ఉంటుంది. కొంతమందికి వాంతులు కూడా ఉంటాయి. పలువురికి
జీర్ణ సమస్యలు అసిడిటీలా కూడా అనిపిస్తుంది.
కార్డియాక్ అరెస్ట్ వెంటనే ఏం చేయాలి ?
కార్డియాక్ అరెస్ట్ జరిగితే ముందుగా చేయాల్సింది.. అంబులెన్స్‌కి కాల్ చేయడం కాదు. బాధితుడికి తొలుత సీపీఆర్ చేయాలి. సీపీఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసిస్టెషన్. ఇందులో భాగంగా మన రెండు చేతులతో బాధితుడి ఛాతీపై గట్టిగా ఒత్తాలి. దీనివల్ల ఆగిపోయిన గుండెలో మళ్ళీ చలనం మొదలవుతుంది. ఒకవేళ కార్డియాక్ అరెస్టుతో గుండె ఆగితే .. గుండె నుంచి శరీర భాగాలకు రక్తం పంపిణీ ఆగిపోతుంది.
కార్డియాక్ అరెస్టుకు కారణాలు?
కార్డియాక్ అరెస్టుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటంటే..ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం,అధిక రక్తస్రావం కలిగించే హెమరేజెస్, గుండె వాల్వుల్లో ఇబ్బందులు,గుండె కండరాల్లో వాపుకి సంబంధించిన
లాంగ్ క్యూటీ సిండ్రోమ్ డిజార్డర్లు అయి ఉండొచ్చు. ఇవి ఒక్కో వ్యక్తి లో ఒక్కోలా ఉంటాయి.
కార్డియాక్ అరెస్ట్, గుండె పోటు ఒకటేనా?
చాలామంది కార్డియాక్ అరెస్ట్, గుండె పోటు రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది.కరోనరీ రక్తనాళంలో అడ్డంకి లేదా క్లాట్ ఏర్పడినప్పుడు గుండె కండరాల వరకు రక్తం సరఫరాలో ఆటంకం ఏర్పడటంతో గుండె పోటు లేదా హార్ట్ ఎటాక్ వస్తుంది.హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండెల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. కానీ కొన్ని సార్లు ఈ లక్షణాలు బలహీనంగా ఉండొచ్చు. ఆకస్మికంగా జరిగే కార్డియాక్ అరెస్ట్‌కు భిన్నంగా, హార్ట్ ఎటాక్‌లో గుండె కొట్టుకోవడం నిలిచిపోదు.సమస్యేమిటంటే, హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు, అట్లాగే రికవరీ సందర్భంగా కూడా కార్డియాక్ అరెస్ట్ రావొచ్చు.అలాగని హార్ట్ ఎటాక్ వచ్చిన ప్రతిసారీ కార్డియాక్ అరెస్ట్ వస్తుందనేం లేదు. కానీ ఆ ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
* ఒత్తిడి లేని జీవనం
* యోగా, ధ్యానం చేయడం
* రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్
* వర్కౌట్స్
* నీరు తాగడం
* మంచి డైట్
* సరైన నిద్ర
* జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండడం
* ఆనందంగా ఉండడం..
Related News

Andhra Pradesh: ఏపీకి జవాన్ గోపరాజు మృతదేహం
ఆంధ్రపరదేశ్ బాపట్లకు చెందిన ఆర్మీ జవాను గోపరాజు గుండెపోటుతో మృతి చెందారు.ప్రస్తుతం ఆయన మృతదేశాన్ని ఏపీకి తీసుకొస్తున్నారు.