Arthritis: మీరు కూడా కీళ్లనొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే!
కీళ్ల నొప్పుల సమస్యతో ఇబ్బంది పడే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:03 PM, Thu - 17 April 25

కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కీళ్ల నొప్పులు సమస్యలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఒకటి అని చెప్పాలి. ఇదివరకటి రోజుల్లో కేవలం వృద్ధాప్య వయసు వచ్చిన వారికి మాత్రమే ఈ కీళ్లనొప్పుల సమస్యలు ఇబ్బంది పెట్టేవి. కానీ ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కీళ్ల నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలట. కీళ్ళ నొప్పులకు ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఆ నొప్పులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది..
కీళ్ల నొప్పులతో బాధపడేవారు దుంప కూరలు తినకూడదట. ఆలుగడ్డ, చేమ గడ్డ, కంద గడ్డ వంటి వాటిని తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. దుంప కూరలతో కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయట. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదట. కీళ్ల నొప్పులకు ఉప్పు కూడా ఒక కారణం అవుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే కీళ్ల నొప్పి మరింత తీవ్రతరమవుతుందట. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆహారంలో ఉప్పును తక్కువగా తినాలని చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు తీపి పదార్థాలను కూడా ఎక్కువగా తినకూడదట. ఎక్కువ తీపి పదార్థాలను తింటే కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయట.
వీటివల్ల కణాలకు, కీళ్లకు ఇబ్బంది ఏర్పడుతుందట. ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్, సోడాలు, ఐస్క్రీమ్ లు వంటి వాటిని కీళ్ల నొప్పులు ఉన్నవారు తీసుకోకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. అంతేకాదు కీళ్ల నొప్పులతో బాధపడేవారు శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాలను, రెడీ టు ఈట్ ఆహారాలను అసలు తినకూడదట. ఆల్కహాల్ తాగే వారిలోనూ కీళ్లనొప్పులు అధికంగా ఉంటాయట. ఆల్కహాల్ తాగడం కారణంగా శరీరంలో ఉండే నీరు, పోషకాలు తగ్గిపోతాయట. ఇది కీళ్లనొప్పిని మరింత పెంచుతుందని, ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెడ్ మీట్ ను ఎక్కువగా తినకూడదని, రెడ్ మీట్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయని అందుకే రెడ్ మీట్ ను తినకుండా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.