Peanuts: చలికాలంలో పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?
చలికాలంలో పల్లీలు తింటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 11:00 AM, Sun - 24 November 24

చలికాలం మొదలైంది అంటే చాలు చలితో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇక చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం రకరకాల ఆహార పదార్థాలను కూడా తింటూ ఉంటారు. అలాగే ఉన్ని దుస్తులను ధరిస్తూ ఉంటారు. వాడితో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చట. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదండోయ్, మనకు ఈ సీజన్ లో అవసరం అయిన పోషణను కూడా అందిస్తాయట.
అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతాయట. ఇక చలికాలంలో తినాల్సిన అతి ముఖ్యమైన ఆహార పదార్థాలలో పల్లీలు కూడా ఒకటి. పల్లీలు అంటే చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. కానీ వీటిని ఈ సీజన్ లో తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చట. పల్లీలను చలికాలంలో తింటే మనకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. చాలా మంది చలికాలంలో బద్దకంగా ఉంటారు. కనీసం పనిచేయాలన్నా కూడా ఉత్సాహం ఉండదు. అలాంటప్పుడు కొన్ని పల్లీలను తినాలట. దీంతో శరీరానికి శక్తి లభించి,ఉత్సాహంగా మారుతారట. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పల్లీలను ఉడకబెట్టి తింటే రోజంతటికీ కావల్సిన శక్తి, పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల రోజంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తారట. అలాగే నీరసం, అలసట అనేవి ఉండవని చెబుతున్నారు. కాబట్టి పల్లీలను చలికాలం తినడం వల్ల బద్దకాన్ని పోగొట్టుకోవచ్చట. పల్లీలను తినడం వల్ల మనకు విటమిన్ ఇ లభిస్తుందని, ఇది మన శరరీంలో ఇమ్యూనిటీని పెంచుతుందని చెబుతున్నారు. చలికాలంలో మనకు సహజంగానే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. కానీ పల్లీలను రోజూ గుప్పెడు తింటే ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి సైతం పల్లీలు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
చలికాలంలో మన చర్మం పగులుతుంది. కానీ పల్లీలను తింటుంటే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మం పగలకుండా నిరోధించవచ్చట. పల్లీలలో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుందట. ఇది చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచి, చర్మం మృదువుగా మారి పగలకుండా చేస్తుందట. అలాగే చర్మానికి కూడా రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. పల్లీలను తినడం వల్ల మన శరీరంలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ రిలీజ్ అవుతుందట . ఇది మన మూడ్ ను మారుస్తుందట. దీంతో మనం ఉత్సాహంగా ఉండటంతో పాటు చురుగ్గా పనిచేస్తాం అని చెబుతున్నారు.