Papaya: ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి తింటే నిజంగా అబార్షన్ అవుతుందా?
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుంది నిజంగానే అబార్షన్ అవుతుందా ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:50 PM, Wed - 25 December 24

గర్భం ధరించిన మహిళలు బొప్పాయిని తినడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అయితే బాగా మగ్గిన బొప్పాయిని తినడం వల్ల ఎలాంటి నష్టం జరగదు. కానీ పచ్చి బొప్పాయిని తింటేనే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో పపాయన్ అనే ఎంజైమ్ అధిక మోతాదులో ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భ సంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. దీంతో అబార్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఒక వేళ బొప్పాయిని తినాలపిస్తే బాగా మగ్గిన పండును తేనెతో కలిపి తీసుకుంటే పపాయన్ ఎంజైమ్ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇక పాలు కారే పచ్చి బొప్పాయిని తినడం వల్ల శరీరంలో ప్రోస్టగ్లాండిన్స్ అనే హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇవి కూడా గర్భసంచి గోడలు కుచించుకుపోయేలా చేస్తాయి. దీంతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి గర్భం ధరించాలనుకునే వారు, గర్భిణులు బొప్పాయికి దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.గుండె జబ్బులు ఉన్నవారు బొప్పాయిని మితంగా తింటేనే మంచిది. బొప్పాయిలో ఉండే ఆమైనో ఆమ్లం గుండెకు హానికరం.
అలాగే హైపోథైరాయిడిజంతో బాధపడే వారు ఈ పండుకు దూరంగా ఉండటమే బెటర్. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయిని దూరం పెట్టాలి. శ్వాస సమస్యలు, జ్వరం, ఆస్తమా వంటి ఉన్న వాళ్లు బొప్పాయిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అయితే గర్భిణిగా ఉన్న స్త్రీలు ఈ బొప్పాయి పండు తినవచ్చా లేదా అని ఇంకా సందేహాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యుల సలహా తీసుకొని ఆ తర్వాత బొప్పాయి పండు తీసుకోవడం మంచిది. బొప్పాయి పండు అలాగే పైనాపిల్ వంటివి గర్భిణీ స్త్రీలు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.