Soda: తరచూ సోడా తాగితే ఏం జరుగుతుందో.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
Soda: తరచుగా సోడా తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:00 AM, Tue - 30 September 25

Soda: వేసవి కాలం వచ్చింది అంటే చాలు సోడాలు వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సోడాలు వంటివి తాగుతూ ఉంటారు. ముఖ్యంగా మందుబాబులు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఎప్పుడో ఒకసారి తాగితే పర్లేదు కానీ ప్రతిరోజు తరచుగా సోడా తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.
మరి రోజు ఒక సోడా తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజూ ఒక సోడా తాగడం వల్ల కూడా కాలేయం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందట. రోజుకి ఒకటి చక్కెరతో నిండిన సోడా తాగడం వల్ల కచ్చితంగా కాలేయానికి తీవ్రమైన నష్టం కలుగుతుందట. తరచుగా ఇలా సోడాలు తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట. అలాగే పేగు కు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
తరచుగా సోడాలు కూలింగ్ వంటి పానీయాలు ఎక్కువగా తాగితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయట. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకముందే వీటిని అవాయిడ్ చేయడం మంచిది అని చెబుతున్నారు. అలాగే సోడాకు బదులుగా నీళ్లు లేదా చక్కెర కలపని టీ వంటివి తాగడం కేవలం చక్కెరను తగ్గించడమే కాదు, అది మీ కాలేయాన్ని, మీ శక్తిని, మీ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని చెబుతున్నారు.