Diabetes: షుగర్ పేషంట్లకు గుడ్ న్యూస్… ట్యాబ్లెట్ రూపంలో సెమాగ్లూటైడ్ మందు..!
షుగర్ పేషంట్లకు గుడ్ న్యూస్. డయాబెటిస్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఔషధ కంపెనీ నోవోనార్డిస్క్ ఈ కొత్త మందును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
- By Hashtag U Published Date - 12:53 PM, Fri - 21 January 22

షుగర్ పేషంట్లకు గుడ్ న్యూస్. డయాబెటిస్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఔషధ కంపెనీ నోవోనార్డిస్క్ ఈ కొత్త మందును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మనదేశ జనాభలో సగం మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. సాధారణం కంటే ఎక్కువ శాతం మందిని ఈ సమస్య వేధిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఎన్నో షుగర్ నియంత్రించే మందులు వచ్చాయి. అయినా ఈ సమస్య నుంచి బయటపడటం లేదు. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ప్రముఖ ఔషధ కంపెనీ నోవోనార్డిస్క్ గుడ్ న్యూస్ చెప్పింది. డయాబెటిస్ నిర్మూలనలో అద్భుతంగా పనిచేస్తున్న సెమాగ్లూటైడ్ మందును ప్రపంచంలోనే మొదటిసారిగా ఓరల్ ట్యాబ్లెట్ రూపంలో అందిస్తోంది. ఇప్పటివరకు ఈ మందు ఇంజక్షన్ రూపంలో అందుబాటులో ఉండేది. డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడంతోపాటు, బరువు తగ్గించడంలోనూ ఈ మందు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తోంది.
కాగా ఇప్పటికే ఈ మందుపై భారత్ లోపాటు పలు దేశాల్లో పది ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ను నోవోనార్డిస్క్ సంస్థ నిర్వహించింది. ఈ ట్రయల్స్ లో దాదాపు వెయ్యి మందికి పైగా భారతీయులై ఉన్నారని కంపెనీ ప్రకటించింది. అమెరికా మార్కెట్లో ఈ ఔషధానికి 2019లో ఆమోదం లభించగా…భారత్ లో 2020 డిసెంబర్ లో క్లియరెన్స్ లభించింది. సెమాగ్లూటైడ్ ఔషధాన్ని గోళీల రూపంలో తీసుకొచ్చేందుకు నోవోనార్డిస్క్ సంస్థ 15 ఏళ్లుగా నిరంతర పరిశోధనలు నిర్వహించింది. చివరికి విజయాన్ని సాధించింది.
ప్రపంచంలో ప్రముఖ ఆరోగ్య సంస్థ నోవోనార్డిస్క్. దీని హెడ్ క్వార్టర్స్ డెన్మార్క్ లో ఉంది. ఈ కంపెనీ దాదాపు 80 దేశాల్లో విస్తరించింది. సుమారు 47వేల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. 170 దేశాల్లో ఈ కంపెనీ తన ప్రొడక్టులను మార్కెట్ చేస్తోంది.