Beauty Tips: క్షణాల్లో ముఖం మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే!
కొన్ని రకాల ప్యాక్ లు ట్రై చేస్తే క్షణాల్లోనే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:00 PM, Wed - 11 September 24

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు అందం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు వహించడంతో పాటుగా వేలకు వేలు ఖర్చుపెట్టి మరి బ్యూటీ పార్లర్లకు వెళుతూ ఉంటారు. ఇదివరకటి రోజుల్లో కేవలం స్త్రీలు మాత్రమే అందం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో పురుషులు కూడా బ్యూటీ పార్లర్ కు వెళ్లడం అలవాటు నేర్చుకున్నారు. ముఖ్యంగా సిటీ లలో ఉండేవారు ఎక్కువగా పార్టీలకు పబ్బులకు వెళ్తూ ఉంటారు. అలాంటివారు ఇన్స్టెంట్గా ఏవైనా ఫేస్ ప్యాక్లను ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా క్షణాల్లో ముఖం మెరిసిపోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చాలు కొద్దిసేపట్లోనే ముఖం చాలా అందంగా తయారవుతుంది. మరి ఆ వివరాల్లోకీ వెళితే..
శనగపిండి పసుపు ఉపయోగించి ఇన్స్టంట్ గా రెమిడిని తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ చేయడానికి మీరు రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, ఒక టీస్పూన్ పసుపు పొడిని కలపాలి. పేస్ట్ చేయడానికి పాలు లేదా రోజ్ వాటర్ ఉపయోగించాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది. మరొక ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే.. బంగాళాదుంప నల్లటి వలయాలకు తొలగించడానికి బాగా పనిచేస్తుంది. కలబంద శీతలీకరణ ప్రభావాలకు గొప్పది. బంగాళాదుంప, అలోవెరా జెల్, శనగ పిండి మీ చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తాయి.
ఈ ప్యాక్ చేయడానికి బంగాళదుంప గుజ్జు, అలోవెరా జెల్ , రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండిని కలపాలి. మీరు పేస్ట్ చేయడానికి నీటిని ఉపయోగించవచ్చు. ఈ DIY ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసి, మీ చర్మంపై 10 నిమిషాల పాటు ఉంచి, తర్వాత శుభ్రం చేయవచ్చు. ఇలా చేస్తే క్షణంలో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం. మరొకటి నిమ్మకాయ, టొమాటో ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ కోసం, టొమాటో గుజ్జును తీసుకొని, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపితే అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే చాలు క్షణాల్లోన్నే మెరిసిపోయే అందం మీ సొంతం. కాఫీ ఒక గొప్ప స్క్రబ్ , పాలు చర్మానికి పోషణకు ప్రసిద్ధి. రెండు పదార్థాలను 2:1 నిష్పత్తిలో కలపి,మీ ముఖం మీద అప్లై చేయాలి. పాలలోని లక్షణాలు మీ చర్మానికి స్థితిస్థాపకతను నిర్ధారిస్తాయి. ఇది ముఖంపై ముడతలను తగ్గించడంతో పాటు, ముఖం మెరిసిపోయేలా చేయడంలో సహాయపడుతుంది.