Mutton: మేక మాంసం మంచిదే కానీ.. వీరికి మాత్రం చాలా డేంజర్.. అస్సలు తినకూడదట!
మటన్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మటన్ అసలు తినకూడదని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 13-02-2025 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
నాన్ వెజ్ లో చాలామంది ఇష్టపడే వాటిలో మటన్ కూడా ఒకటి. మటన్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చికెన్ తో పోలిస్తే మటన్ వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఫంక్షన్ లు జరిగితే మటన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. చాలామంది చికెన్ కి బదులుగా మటన్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే మటన్ మంచిదే అయినప్పటికీ మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. అయితే కొంతమంది మటన్ ఎక్కువగా తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.
ఇంతకీ మటన్ ఎవరు ఎక్కువగా తినకూడదు అన్న విషయానికి వస్తే.. పిల్లలకు అధిక మొత్తంలో మటన్ పెట్టకూడదట. ఎందుకంటే పిల్లలు కాలేయాలు, కిడ్నీలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి ఎక్కువ ప్రోటీన్ ను మెయింటెయిన్ చేయలేవట. మటన్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబ్టటి పిల్లలు ఎక్కువ మటన్ తినకూడదట. చాలామంది తరచుగా తమకు ఒంట్లో వేడిగా ఉందని అంటుంటారు. హై ఫీవర్, ఫైల్స్, పంటి నొప్పి,కఫంతో బాధపడే వాళ్లకి కూడా శరీరంలో వేడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వారు కూడా మేక మాంసం తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.
మటన్ ఎక్కువ తింటే ఇది మీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందట. కాబట్టి మేక మాంసంకి దూరంగా ఉండమే మంచిదని చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఉంటే కాలేయ సంబంధిత వ్యాధులు మెయిన్ గా ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వాళ్లు మేక మాంసం అస్సలు తినకూడదట. ఎందుకంటే మేక మాంసంలో ఉండే అధిక ప్రోటీన్ కాలేయంపై ఒత్తిడి తెస్తుందటీ. కాబట్టి కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు దీనిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. మటన్ తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. కాబట్టి ఏది తీసుకున్న కూడా మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.