Sperm Decreasing Foods : వీర్య లోపం తగ్గాలా ? అయితే ఈ ఫుడ్స్ కు దూరంగా ఉండాల్సిందే
తినే ఆహారం వల్ల కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుందట. ముఖ్యంగా సోయా ఉత్పత్తులు ఎక్కువగా తినకూడదని లైంగిక సామర్థ్య నిపుణులు చెబుతున్నారు.
- By News Desk Published Date - 07:00 AM, Thu - 19 October 23

Sperm Decreasing Foods : కొత్తగా పెళ్లైన ఏ దంపతుల్నైనా ఆ తర్వాత అందరూ అడిగే ప్రశ్న పిల్లల్ని ఎప్పుడు కంటారు ? ఇలా పెళ్లవుతుందో లేదో.. నెలరోజులకే ఇంకా అమ్మాయి కన్సివ్ అవ్వలేదా అంటూ మొదలుపెడతారు. ఈ జనరేషన్ లో తినే ఆహార లోపం, హార్మోన్ల లోపంతో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. భార్య లేదా భర్త.. ఇద్దరిలో ఎవరికి లోపం ఉన్న పిల్లలు పుట్టడం అసాధ్యం. మగవారిలో వీర్యలోపం ఉంటే.. పిల్లలు పుట్టడం ఇంకా కష్టం. అందుకే మగవాళ్లు మొబైల్స్ ను ప్యాంట్ పాకెట్ లో పెట్టుకోకూడదని, ల్యాప్ టాప్ లను కాళ్లపై పెట్టి వాడకూడదని వైద్యులు సూచిస్తుంటారు. వీర్యకణాల సంఖ్య తగ్గితే.. మళ్లీ దానిని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది.
తినే ఆహారం వల్ల కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుందట. ముఖ్యంగా సోయా ఉత్పత్తులు ఎక్కువగా తినకూడదని లైంగిక సామర్థ్య నిపుణులు చెబుతున్నారు. సోయా ఉత్పత్తులు పురుషులలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిల్ని పెంచుతాయి. ముఖ్యంగా మిల్ మేకర్స్ ను పురుషులు ఎక్కువగా తినకూడదు. ఇవి టెస్టోస్టిరాన్ స్థాయిల్ని తగ్గించి స్త్రీల హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుతాయి. ఫలితంగా వీర్య ఉత్పత్తి తగ్గుతుంది. అనతికాలంలోనే శృంగార సామర్థ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సంతానం కూడా కలగకపోవచ్చు.
అలాగే.. కొందరు కూల్ డ్రింక్స్, మద్యం ఎక్కువగా తాగుతుంటారు. ఇవి కూడా శృంగార సమస్యల్ని కలుగజేస్తాయి. వీర్య ఉత్పత్తిని నాశనం చేస్తాయి. ఎక్కువకాలం ప్యాకెట్లు లేదా డబ్బాలలో నిల్వ చేయబడిన, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ను కూడా తినకూడదు. ఇవి కేవలం పురుషులకే కాదు.. ఎవరి ఆరోగ్యానికీ అంతమంచిది కాదు. వీటి వల్ల హార్మోన్ల సమస్యలు వస్తాయి.
ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగును కూడా ఎక్కువగా తీసుకోకూడదు. సహజసిద్ధమైన పదార్థాలకే ప్రాధాన్యమివ్వడం దాంపత్య జీవితానికి మంచిది. ఈ ఐదు రకాల ఆహారాలకు పురుషులు ఎంత దూరంగా ఉంటే.. లైంగిక సామర్థ్యానికి అంత మంచిది.
Also Read : Purple Cabbage Benefits: పర్పుల్ క్యాబేజీతో బోలెడు ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!