Ranapala : రణపాల ఆకులతో బోలెడు లాభాలు.. ఈ వ్యాధులున్నవారు తీసుకుంటే
- Author : Vamsi Chowdary Korata
Date : 28-10-2025 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం చాలా మంది చలి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారు. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు క్రమం తప్పకుండా రణపాల ఆకుల మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
Ranapala Benefits: ఆయుర్వేదం శాస్త్రంలో ఆనేక రకాల ఆయుర్వేద మూలికల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రకృతిలో లభించే ప్రతి చెట్టు ఎదో ఒక రకంగా ఔషధ మూలికగా పని చేస్తుంది. కొన్ని మూలికలు ఆకల రూపంలో కూడా ఉంటాయి. అయితే పూర్వీకులు ఆడవి ప్రాంతాల్లో మూలికలను సేకరించి జబ్బు పడ్డవారికి వైద్యం చేసేవారు. ప్రస్తుతం చాలా మంది ఆయుర్వేద నిపుణులు ఇవే మూలికలను వినియోగించి పాత పద్దతులను అనుసరించి వైద్యం చేస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది ఇంట్లోనే ఆయుర్వేద మూలికలు కలిగిన మొక్కలను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం పెంచుకుంటున్న వాటిలో రణపాల మొక్క ఒకటి. దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
రణపాల ఆకుల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, యోని ఇన్ఫెక్షన్, రక్తపోటు మొదలైన సమస్యలను దూరం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా రెగ్యులర్ వినియోగం వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
తలనొప్పి:
తలనొప్పితో బాధపడేవారు రణపాల ఆకులను మిత్రమంలా తయారు చేసి తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మైగ్రేన్ నొప్పిలను కూడా తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రణపాల ఆకులను వినియోగించాలి.
గాయాలను త్వరగా నయం చేస్తుంది:
శరీరం నుంచి గాయాలను, పచ్చలను తొలగించేందుకు రణపాల ఆకు మిశ్రమం ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గాయాలను మానిపించేందుకు మంచి రెమెడీగా పని చేస్తుంది. ముఖ్యంగా చేతులపై గాయాలు,మచ్చలను సులభంగా తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
యోని ఇన్ఫెక్షన్స్:
ప్రస్తుతం చాలా మంది మహిళల్లో యోని ఇన్ఫెక్షన్స్ సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి యోని ఇన్ఫెక్షన్స్ సమస్యలతో బాధపడేవారు రణపాల ఆకులతో తయారు చేసిన కషాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. అయితే ఇదే కషాయంలో 2 గ్రాముల తేనె కలిపి తాగడం వల్ల రెట్టింపు లాభాలు పొందుతారు.