Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లు తినవచ్చా తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
గర్భిణీ స్త్రీలు వేసవికాలంలో దొరికే మామిడిపండ్లను తినవచ్చా తినకూడదా? ఒకవేళ అతిగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
- By Anshu Published Date - 05:03 PM, Wed - 26 March 25

మామూలుగా స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతూ ఉంటారు. లేదంటే అది ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుందని చెబుతుంటారు. అయితే గర్భవతిగా ఉన్న స్త్రీలు సీజనల్ పండ్లను కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అందుకే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెబుతుంటారు. ఇకపోతే ప్రస్తుతం సమ్మర్ కావడంతో ఈ సమ్మర్ లో ఎక్కువగా దొరికే పండ్లలో మామిడి పండ్లు కూడా ఒకటి. మరి మామిడి పండ్లను సమ్మర్ లో తినవచ్చా తినకూడదా? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక చిన్న కప్పు మామిడి ముక్కలు రోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ సీ అందుతుందట. ఇక విటమిన్ సి టిష్యూ రిపేర్ కీ, రోగనిరోధక శక్తి పెంచడానికి, కడుపులో బిడ్డ ఎముకలు, దంతాలు బలంగా మారడానికి సహాయపడతాయని చెబుతున్నారు. పండులో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుందట. అందుకే ఈ పండు తినడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ రోగనిరోధక శక్తి కోసం ఏవైనా ఇన్ఫెక్షన్లు, డయేరియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయట. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూటీయంట్స్, ఎనర్జీని అందిస్తాయట.
అందుకే గర్భిణీ స్త్రీలు ఎలాంటి సందేహం లేకుండా మామిడి పండు తినవచ్చని చెబుతున్నారు. అయితే మామిడిపండు మంచిదే అన్నారు కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. ఇది తల్లి ఆరోగ్యం తో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదట. గర్భిణీ స్త్రీలలో ఇప్పటికే మధుమేహం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు మామిడిపండ్లకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. ఒకవేళ గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లు తినాలి అనుకున్న కూడా వాటిని కొద్దిసేపు నీటిలో నానబెట్టి తినడం మంచిదని చెబుతున్నారు.