Mango Leaves : మామిడి ఆకులతో ముఖంపై మచ్చలు మాయం
Mango Leaves : విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో చర్మం మృదువుగా మారటమే కాకుండా, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యువంగా ఉంచుతుంది
- Author : Sudheer
Date : 25-03-2025 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
ఎండాకాలం అంటే అందరికీ మామిడి పండ్లే (Mangoes Fruits) గుర్తొస్తాయి. కానీ మామిడి ఆకులు (Mango Leaves) కూడా ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే సంగతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులను (Mango Leaves) తోరణాలుగా ఇంటి గుమ్మానికి వేలాడదీయడం చూస్తుంటాం. అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం మామిడి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో, చర్మాన్ని తేజస్సుగా మార్చే గుణాలు ఉంటాయి. ప్రత్యేకంగా మొటిమలు, నల్లటి మచ్చలు, చర్మానికి సంభందించిన ఇతర సమస్యలను తగ్గించేందుకు మామిడి ఆకుల నుండి తయారయ్యే ఫేస్ ప్యాక్ చాలా ఫలితమిస్తుంది.
Gaddam Vivek Venkatswamy : వివేక్ కు మంత్రి పదవి పై మల్లారెడ్డి కామెంట్స్
మామిడి ఆకుల(Mango Leaves)లో మాంగిఫెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది చర్మంపై ఉన్న మొటిమల మచ్చలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో చర్మం మృదువుగా మారటమే కాకుండా, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యువంగా ఉంచుతుంది. చర్మం మీద ముడతలు, వయస్సు వల్ల వచ్చే సంకేతాలను తగ్గించేందుకు కూడా మామిడి ఆకుల నుంచి తయారైన ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కాంతివంతమైన చర్మం కావాలనుకునేవారు మామిడి ఆకులతో తయారుచేసిన ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం పొందగలరు.
Vallabhaneni Vamsi : మరోసారి వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు
మామిడి ఆకుల ఫేస్ ప్యాక్ తయారీ చాలా సులభం. ఐదు మామిడి ఆకులను శుభ్రంగా కడిగి, వాటిని పొడి చేసి, రెండు చెంచాల కొబ్బరి నూనె కలిపి గట్టి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం గ్లో పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మామిడి ఆకుల పొడిలో పెరుగు కలిపి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారి, మొటిమలు తగ్గుతాయి. ఈ సహజ పద్ధతులను పాటించడం ద్వారా రసాయనిక ఉత్పత్తులను ఉపయోగించకుండానే ఆరోగ్యవంతమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.