Lemon Side Effects: నిమ్మకాయను మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త సుమీ!
Lemon Side Effects: నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా చేసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 05:00 PM, Mon - 6 October 25

Lemon Side Effects: నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ సిట్రస్ జాతికి చెందినది. నిమ్మకాయను తరచుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని చెబుతున్నారు. అలాగే నిమ్మ జలుబు, ఫ్లూతో పోరాడటానికి హెల్ప్ చేస్తుంది. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు.
అదేవిధంగా నిమ్మకాయ మెటబాలీజంను పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయం చేస్తుందట. నిమ్మరసం శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుందని, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మెరుపునిస్తాయని చెబుతున్నారు. అలాగే నిమ్మకాయలో ఆమ్లం ఎక్కువగా ఉంటుందట. దీనిని ఎక్కువగా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఇవి దంతాలపై ఎనామిల్ ను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. దంతాలపై ఉండే ఎనామిల్ తొలగిపోతే దంతాల సున్నితత్వం పెరుగుతుందట.
అలాంటప్పుడు నిమ్మరసం కలిపిన నీరు తాగిన తర్వాత నోటిని పుక్కిలించాలని,లేదా నీటిని తాగేందుకు స్ట్రా ఉపయోగించాలని చెబుతున్నారు. ఎసిడిటీ లేదా గుండెల్లో మంట సమస్య ఉన్నవారు నిమ్మకాయను ఎక్కువగా తీసుకోకూడదట. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఈ సమస్యలను పెంచుతుందట. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇది పెప్సిన్ ఎంజైమ్ ను యాక్టివేట్ చేసి గుండెల్లో మంట సమస్య పెంచుతుందని చెబుతున్నారు. నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే పదేపదే మూత్రం రావడానికి కారణం అవుతుందట. అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడవచ్చని, ఇందులో సిట్రిక్ ఆమ్లం కాకుండా కొంత మోతాదులో ఆక్సలేట్ కూడా ఉంటుందని, ఎక్కువగా తీసుకుంటే క్రిస్టల్స్ రూపంలో ఆక్సలేట్ పేరుకుపోవచ్చని, దీనివల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు..