Lemon: నిమ్మకాయ తొక్కలను పారేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల
- By Nakshatra Published Date - 09:30 AM, Fri - 14 October 22
నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. నిమ్మకాయలు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మ పండు కేవలంఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మ పండు జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే సాధారణంగా నిమ్మకాయలను ఉపయోగించి వాటి తొక్కలను పారేస్తూ ఉంటారు. కానీ నిమ్మ తొక్కల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని చాలామందికి తెలియదు. మరి నిమ్మకాయ తొక్క వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మ తొక్కల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్థాయి.
షుగర్ వ్యాధి, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి రోగాల ప్రమాదాలాను తగ్గించడానికి దీనిలో ఉండే డీలైమొనేన్ సహాయపడుతుంది.అలాగే నిమ్మ తొక్క బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతుంది.
నిమ్మకాయ తొక్కను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు, నల్లని మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. చర్మం కూడా నిగనిగలాడుతుంది. ఇకపోతే నిమ్మతొక్కల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మ తొక్కల్లో కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలుంటాయి. అలాగర్ నిమ్మ తొక్క నోటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు హార్ట్ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తాయి. నిమ్మ తొక్కలు రక్తంలో కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి.
ఈ తొక్కలను వంటగదిని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం సగం నిమ్మ తొక్కను తీసుకుని దానిని బేకింగ్ సోడాలో ముంచండి. దానితో గ్యాస్ బండను , స్లాబ్ ను క్లీన్ చేయండి. బేకింగ్ సోడాతో పాటుగా, తొక్కలకు కాస్త వెనిగర్ ను కూడా కలిపి కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా వర్షాకాలంలో కీటకాలు ఒంటికి ఎక్కువగా అంటుకునే ప్రమాదముంది. అయితే స్నానం చేసేటప్పుడు నిమ్మతొక్కను శరీరానికి రుద్దడం వల్ల శరీరంపై ఉన్న కీటకాలు తొలగిపోతాయి.
Related News
Health: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి
Health: బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారా.. అయితే కొన్ని చిట్కాలతో ఈజీగా తగ్గవచ్చు. నిమ్మకాయను ఉపయోగించడం ద్వారా మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఒక తీవ్రమైన సమస్యగా మిగిలిపోయింది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక రకమైన సూపర్ ఫుడ్. ఇది ఒక రకమైన సిట్రస్ పండు. మీరు దీన్ని మీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. నిమ్మకాయ