Break Fast: ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రస్తుత రోజుల్లో మనుషుల ఆహారపు అలవాటు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దానికి తోడు అనారోగ్య సమస్యలు కూడా అలాగే వెంటాడుతున్నాయి.
- By Anshu Published Date - 10:55 AM, Tue - 16 July 24

ప్రస్తుత రోజుల్లో మనుషుల ఆహారపు అలవాటు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దానికి తోడు అనారోగ్య సమస్యలు కూడా అలాగే వెంటాడుతున్నాయి. ఇదివరకటి రోజుల్లో మనుషులు ఉదయాన్నే ఎనిమిది గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ చేసేసి ఎవరి పనులకు వారు వెళ్లేవారు. కానీ ప్రస్తుత జనరేషన్లో మాత్రం ఉదయం ఎప్పుడో పదింటికి లేచి మధ్యాహ్న సమయంలో బ్రేక్ ఫాస్ట్ లు చేస్తుంటారు. కొంతమంది అల్పాహారానికి బదులుగా మధ్యాహ్నం ఏకంగా భోజనం కూడా చేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు.
ముఖ్యంగా ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ చేస్తే అనేక రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు. మరి ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం నిద్రలేచిన రెండు గంటల లోపే అల్పాహారం తినాలి అంటున్నారు వైద్యులు. అలా కాకుండా ఉదయం ఎప్పుడో 9, 10,11 గంటలకు తినడం అంత మంచిది కాదని అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. అల్పాహారం తినడం మాత్రమే కాదు ఏ సమయానికి తింటున్నాము అన్నది కూడా గుర్తుంచుకోవాలంటున్నారు వైద్యులు. అల్పాహారం ఆలస్యంగా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు.
ఉదయం 9 గంటల తర్వాత మొదటి భోజనం చేసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆలస్యమైన ప్రతి గంటకూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6 శాతం పెరుగుతుందట. నమ్మడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం అంటున్నారు వైద్యులు. రాత్రిపూట ఆలస్యంగా తినడం లేదా ఉదయం లేట్‌గా అల్పాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అయినప్పటికీ, రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసం ఉండటం వల్ల స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చట. రాత్రి 8 గంటలకు ముందు తిన్న వారి కంటే రాత్రి 9 గంటల తర్వాత తిన్న స్త్రీలకు స్ట్రోక్ , సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గుండె జబ్బులను తగ్గించడంలో భోజన సమయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.