Ivy Gourd Health Benefits: వామ్మో.. దొండకాయ వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?
మన వంటింట్లో దొరికే కూరగాయలలో దొండకాయ కూడా ఒకటి. చాలామంది దొండకాయని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇంకా చెప్పాలి అంటే కొంతమందికి దొండకాయ వెజిట
- By Anshu Published Date - 09:45 PM, Mon - 24 July 23

మన వంటింట్లో దొరికే కూరగాయలలో దొండకాయ కూడా ఒకటి. చాలామంది దొండకాయని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇంకా చెప్పాలి అంటే కొంతమందికి దొండకాయ వెజిటేబుల్ అన్న విషయం కూడా తెలియదు. దొండకాయతో ఎక్కువగా వేపుడు పచ్చడి లాంటివి చేస్తూ ఉంటారు. హనీ దొండకాయ గురించి, దాని వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. దొండకాయలో ఫైబర్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి , క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి..
మరి దొండకాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దొండకాయను మధుమేహానికి ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. షుగర్ పేషెంట్స్ వారంలో ఒక రోజు దొండకాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.దొండలో థయామిన్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ లను గ్రూకోజ్‌గా మార్చే పోషకం. ఇది శరీరంలో శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుంది. జీవక్రియను నియంత్రిస్తుంది.
దొండకాయలోని థయామిన్ రక్త ప్లాస్మాలోకి ప్రవేశిస్తుంది. ఇది మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీకి కూడా సహాయపడుతుంది. దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది. దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. దొండకాయలో స్థూలకాయన్ని నిరోధించే గుణాలు ఉంటాయి..దొండకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అల్సర్లు, ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం చేస్తుంది. కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి. ఇక ఇందులోని బేటా కెరోటిన్ విటమిన్- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆస్తమాను నివారించడంలో కూడా దొండకాయలు కీలక పాత్ర పోషిస్తాయి.