Cool Water: ఎండాకాలంలో ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ తెగ తాగుతున్నారా.. అయితే మీకే నష్టం!
వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి అని ఫ్రిడ్జ్ లో నీళ్లు ఇష్టంగా తాగే వారు ఎక్కువగా తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 05:00 PM, Fri - 4 April 25

వేసవికాలం వచ్చింది అంటే చాలు మండే ఎండల్లో చల్లచల్లగా ఫ్రిజ్లోని వాటర్ తాగుతూ ఉంటారు. కొంతమంది లైట్ కూల్ ఉన్న వాటర్ తాగితే మరి కొంతమంది ఎక్కువ కూల్ ఉన్నా సరే అలాగే తాగిస్తూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట. మరి వేసవి కాలంలో ఫ్రిడ్జ్ లో ఉండే కూల్ వాటర్ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎండల వేడికి తట్టుకోలేక ఫ్రిజ్ నుంచి కూల్ వాటర్ తాగడం వల్ల మలబద్ధక సమస్య వచ్చే ప్రమాదం ఉందట. చల్లటి నీరు తాగినప్పుడు ఆహారం శరీరంలోకి ప్రవేశించినప్పుడు గట్టిగా మారి పేగులు కుంచించుకుపోతాయట. దీని వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని చెబుతున్నారు.
వేసవిలో రిఫ్రిజిరేటెడ్ నీటిని ఎక్కువగా తాగితే, అది హృదయ స్పందన రేటును తగ్గిస్తుందట. ఫ్రిజ్ లోని కూల్ వాటర్ తాగడం వల్ల పదవ కపాల నాడి ఉత్తేజితమవుతుందట. శరీరం అసంకల్పిత చర్యలను నియంత్రించడానికి నరాలు పనిచేస్తాయని చెబుతున్నారు. చల్లటి నీరు వేగస్ నాడిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందట. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని చెబుతున్నారు.
ఎండల్లో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడి ఎదుర్కోని నేరుగా వచ్చి చల్లని లేదా ఐస్ వాటర్ తాగితే మీకు తలనొప్పి రావచ్చట. నిజానికి, చల్లటి నీరు తాగడం వల్ల వెన్నెముక లోని అనేక నరాలు చల్లబడతాయట. ఇది మెదడును ప్రభావితం చేస్తుందట. దీనివల్ల తలనొప్పి వస్తుందని చెబుతున్నారు.
త్వరగా బరువు తగ్గాలనుకుంటే, రిఫ్రిజిరేటెడ్ నీరు తాగడం మానేయాలట. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు గట్టిపడి బరువు తగ్గకుండా నిరోధించవచ్చట. బరువు తగ్గాలనుకునేవారు, వ్యాయామాలు చేసే వారు కూల్ వాటర్ తాగడం మానుకుంటే మంచిదని చెబుతున్నారు.