Laptop: పురుషులు ఇది మీకోసమే.. లాప్టాప్ ను ఒడిలో పెట్టుకొని చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్లు, ట్యాబ్ లతో పాటు ల్యాప్ టాప్ లను కూడా వినియోగిస్తున్నారు. అయితే కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ల్యాప్ టాప్ ను వినియోగిస్తే మరికొందరు అనవసరమైన వాటికోసం ఈ ల్యాప్ టాప్ లను వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది మగవారు ఈ లాప్టాప్ వర్క్ చేసేటప్పుడు
- By Anshu Published Date - 06:51 PM, Tue - 9 July 24

ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్లు, ట్యాబ్ లతో పాటు ల్యాప్ టాప్ లను కూడా వినియోగిస్తున్నారు. అయితే కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ల్యాప్ టాప్ ను వినియోగిస్తే మరికొందరు అనవసరమైన వాటికోసం ఈ ల్యాప్ టాప్ లను వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది మగవారు ఈ లాప్టాప్ వర్క్ చేసేటప్పుడు పెద్ద తప్పు ఒకటి చేస్తుంటారు. అదే లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని చేయడం. ఇలా చేయడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ల్యాప్టాప్ ను గంటల తరబడి మగవారు ఒడిలో పెట్టుకోవడం వల్ల వారి పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
అదేవిధంగా నిరంతరం వేడికి గురి కావడం వల్ల వృషణాల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. క్రమంగా పురుషుల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. అలాగే స్మెర్మ్ నాణ్యత కూడా చాలా వరకు తగ్గుతుంది. స్పెర్మ్ ఉత్పత్తి, పనితీరుకు వాతావరణం చల్లగా ఉండటం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకున్నప్పుడు దాని నుంచి వచ్చే వేడి వృషణాల్లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది స్క్రోటల్ హైపర్థెర్మియా అని పిలువబడే సమస్యకు దారితీస్తుంది. ఇది ఫలదీకరణానికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే స్పెర్మ్ ఉత్పత్తిని కూడా బాగా తగ్గుతుంది. అంతేకాకుండా ల్యాప్ టాప్ లు తరచుగా విద్యుదయస్కాంతత్వాన్ని విడుదల చేస్తాయి.
ఇది స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ల్యాప్ టాప్ నుంచి వచ్చే వేడి, రేడియేషన్ స్పెర్మ్ నాణ్యత, పరిమాణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. సంతానోత్పత్తి సమస్యలు రాకూడదంటే పురుషులు ల్యాప్ టాప్ ను ఒడిలో అస్సలు పెట్టుకోకూడదు. దానికి ప్రత్యమ్యంగా ఇతర అవకాశాల కోసం ప్రయత్నించాలి.