Hot Water: ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు వేడినీటితో స్నానం చేస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:30 PM, Wed - 7 August 24

మనలో చాలామంది వేడినీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా వేసవికాలంలో కూడా వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. మరి ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేయవచ్చా, ఒకవేళ అలా చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా, ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేడి నీటి స్నానం మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు వేడినీటితో స్నానం చేస్తే శరీరం రిలాక్స్ అవుతుందట. అలాగే చర్మం వెచ్చగా మారుతుందట. వేడినీళ్లతో స్నానం చేస్తే ఒత్తిడి తగ్గి మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా వేడి నీటి స్నానం కండరాల బిగుతు, శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుందట. అలాగే కండరాల అలసట నుంచి కూడా వేడినీళ్లు ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. అలాగే హెవీ వ్యాయామం తర్వాత ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.
గోరువెచ్చని నీళ్ళు చర్మానికి మేలు చేస్తాయట. నీటి ఆవిరి చర్మ రంద్రాలను తెరిచి చర్మం కింద చిక్కుకున్న నూనె ధూళిని బయటికి తొలగిస్తుందని చెబుతున్నారు. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందట. వార్మ్ వాటర్ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుందని, అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు దగ్గు, జ్వరం, జలుబు కావడం సర్వ సాధారణం. అయితే వేడినీళ్లతో రెగ్యులర్ గా స్నానం చేయడం వల్ల మెదడు దగ్గర ఉన్న రక్తనాళాలు రిలాక్స్ అవుతాయని చెబుతున్నారు. దీంతో మీ ఒత్తిడి తగ్గుతుందని తలనొప్పి కూడా తొందరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. అయితే వేడి నీళ్లు మంచివే కదా అని ఎక్కువగా కాగుతున్న నీటిని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు..