Man With 5 Kidneys: ఈయన శరీరంలో ఐదు కిడ్నీలు.. ఎవరు ? ఎలా ?
దేవేంద్ర బార్లెవార్(Man With 5 Kidneys) వయసు 47 ఏళ్లు.
- By Pasha Published Date - 06:44 PM, Fri - 21 February 25

Man With 5 Kidneys: కిడ్నీ వ్యాధులు ఏటా ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్లు శరీరమంతా వ్యాపించే దాకా పలువురు బాధితులు గుర్తించలేకపోతున్నారు. వైద్యుల దగ్గరికి వెళ్లే సరికే పరిస్థితులు చేయి దాటుతున్నాయి. మన శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి. అరుదుగా కొందరు 1 కిడ్నీతో జన్మిస్తుంటారు. అయితే ఒక వ్యక్తి శరీరంలో ఇప్పుడు ఏకంగా 5 కిడ్నీలు ఉన్నాయి. ఆయన ఎవరు ? ఐదు కిడ్నీలు ఎలా వచ్చాయి ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Health Insurance Vs Pollution : ఆరోగ్య బీమా పాలసీదారులకు బ్యాడ్ న్యూస్.. ఏమిటో తెలుసా?
ఐదు కిడ్నీల వ్యక్తి ఎవరు ?
- దేవేంద్ర బార్లెవార్(Man With 5 Kidneys) వయసు 47 ఏళ్లు.
- ఈయన భారత రక్షణ శాఖలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు.
- తొలిసారిగా దేవేంద్ర బార్లెవార్‌కు 2010 సంవత్సరంలో కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగింది. అప్పట్లో ఆయనకు తల్లి ఒక కిడ్నీని దానం చేశారు. ఆ కిడ్నీ దాదాపు ఏడాది పాటు పనిచేసింది.
- 2012 సంవత్సరంలో ఒక సమీప బంధువు ముందుకొచ్చి దేవేంద్రకు మరో కిడ్నీని దానం చేశారు. అది దాదాపు పదేళ్ల పాటు పనిచేసింది. 2022 వరకు ఆ కిడ్నీ సజావుగా పనిచేసింది.
- 2020 సంవత్సరంలో దేవేంద్ర బార్లెవార్ కరోనా బారిన పడ్డారు. దీని ప్రభావం 2022 సంవత్సరం వరకు కొనసాగింది. ఈక్రమంలో ఆయనకు డయాలసిస్ చేయడం మొదలుపెట్టారు.
- 2023లో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతడి కిడ్నీని దేవేంద్ర బార్లెవార్‌కు అమర్చారు. ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఉన్న అమృత హాస్పిటల్‌లో ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగింది. అప్పటికే దేవేంద్ర శరీరంలో నాలుగు కిడ్నీలు ఉండటంతో, ఐదో కిడ్నీని ఎక్కడ పెట్టాలనే సవాల్ వైద్యులకు ఎదురైంది.
- అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, యూరాలజీ డాక్టర్ అనిల్ శర్మ సాహసం చేసి నాలుగు గంటల పాటు శ్రమించి దేవేంద్ర బార్లెవార్‌కు ఐదో కిడ్నీని అమర్చారు. కొత్తగా అమర్చిన కిడ్నీ కూడా బాగానే పనిచేస్తోంది. ఈ ఆపరేషన్‌తో దేవేంద్రకు డయాలసిస్ చేయించుకునే బాధ తప్పింది.