Gas Tablets : గ్యాస్ టాబ్లెట్లను ఎక్కువగా మింగుతున్నారా.. అయితే మీరు ఈ ప్రమాదంలో ఉన్నట్టే?
మన చుట్టూ ఉన్న సమాజంలో చాలామందికి ఔషధాల వినియోగం పై సరైన స్పష్టత లేదు.
- By Anshu Published Date - 07:00 AM, Tue - 28 June 22

మన చుట్టూ ఉన్న సమాజంలో చాలామందికి ఔషధాల వినియోగం పై సరైన స్పష్టత లేదు. ఔషధాల వినియోగంపై సరైన అవగాహన లేకుండా చాలామంది ఇష్టం వచ్చినట్టుగా వాటిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ డాక్టర్ రాసిచ్చిన మందులు వాడతాం. అయితే అది ఆరోగ్య సమస్య మళ్ళీ రిపీట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అవి మందులను తెచ్చుకుని వాడుతుఉంటాం. కానీ అలా చేయడం తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్.
కడుపులో మంట, నొప్పి, అజీర్ణం, తేన్పులు ఇవన్నీ జీఈఆర్డీలో భాగమే. మన భారతీయ సమాజంలో ఇప్పుడు 30 శాతానికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మారిన జీవనశైలే ఈ సమస్యకు మూలం. అయితే గ్యాస్ట్రిక్ సమస్యల నివారణ కోసం తీసుకునే మందులనే ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. రాబిప్రజోల్, ఇసమప్రజోల్, ఒమెప్రజోల్, లాన్సప్రజోల్, పాంటాప్రజోల్ ఇవన్నీ ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్ ఔషధాలు. వీటినే యాంటాసిడ్స్ అని కూడా పిలుస్తు ఉంటారు.
వీటిని అతిగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తున్నట్టు పలు అధ్యయనాలలో వెల్లడవగా, గుండె వైద్య నిపుణులు కూడా వీటిపై హెచ్చరిస్తున్నారు. కడుపులో అరగకపోయినా, మంట అనిపించినా, నొప్పి అనిపించినా, తేన్పులు వచ్చినా మిఠాయిల మాదిరే పీపీఐలను కొనుగోలు చేసి వేసుకునే వారు బోలెడు మంది ఉన్నారు. కానీ, వీటిని వైద్యుల సూచన లేకుండా వాడుకోవడం ప్రమాదకరం. వీటిని వినియోగించడం వల్ల 16 21 శాతం గుండె పోటు రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం గుర్తించింది. గుండెలో సమస్య కారణంగా వచ్చే ఛాతీనొప్పిని అసిడిటీగా పొరబడే అవకాశం ఉంది.
యాంటాసిడ్స్ తీసుకుంటున్నా, దీర్ఘకాలం పాటు గుండె మంట ఉంటుంటే ఒక్కసారి తప్పకుండా గుండె చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా గుండె సంబంధిత రిస్క్ అంశాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు అని ఫోర్టిస్ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ అండ్ వ్యాస్కులర్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ మనీష్ హిందుజా తెలిపారు. యాంటాసిడ్స్, పీపీఐల వినియోగం పెరిగితే అది గుండె ఆరోగ్యంపై పలు విధాలుగా ప్రభావం చూపిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ బయో అవైలబులిటీని తగ్గిస్తుంది. ఎలక్ట్రోలైట్స్ లో సమతుల్యత పోతుంది. యాంటీ ప్లేట్ లెట్ ఏంజెట్లతో మమేకం అవుతాయి అని అపోలో హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ అపూర్వ షా తెలిపారు. వైద్యుల సూచనలు లేకుండా పీపీఐల వాడకంతో వచ్చే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఔషధ చట్టం షెడ్యూల్ కేలో చేర్చారు.