Jowar Roti: జొన్న రొట్టె కదా అని తీసి పారేస్తున్నారా.. దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు?
జొన్న రొట్టె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని, జొన్న రెట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు. మరి జొన్న రెట్టె వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:03 AM, Mon - 14 April 25

జొన్నరెట్టే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎప్పుడు అన్నం చపాతి వంటి వాటిని మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మన డైట్ లో భాగంగా జొన్న రొట్టె, సద్ద రొట్టె వంటివి చేర్చుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి చెబుతున్నారు. కానీ చాలామంది జొన్న రొట్టెను తినడానికి అంతగా ఇష్టపడరు. గట్టిగా ఉంటుందని టేస్ట్ గా ఉండదని అనుకుంటూ ఉంటారు. ఈతరం పిల్లోళ్లు యువత జొన్న రొట్టెను తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ జొన్న రొట్టె వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా జొన్నల్లో మినరల్స్, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయట. ఇవన్నీ మన రోజువారీ అవసరాలకి హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. వీటిని తరచుగా తీసుకుంటే పోషకాలన్నీ మనకి అందుతాయట. జొన్న రొట్టెల్ని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోని టాక్సిన్స్ దూరం చేస్తాయట. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయట. జొన్న రొట్టెల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు రావు. మలబద్ధకం, అజీర్ణం ఇతర ఆరోగ్యం సమస్యలు కూడా దూరమవుతాయట. జీర్ణ వ్యవస్థ కూడా సరిగా పనిచేస్తుందట. అలాగే జొన్నల్లో కాల్షియం, పాస్ఫరస్‌లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఎముకలకి బలం చేకూరుతుందట. వయసు వల్ల వచ్చే ఎముకలకి సంబంధించిన సమస్యలు దూరమవుతాయట.
అదే విధంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్ ని దూరం చేసి ఇమ్యూనిటీని బలంగా చేస్తుందట. ఇందులోని కార్బోహైడ్రేట్స్ ఎనర్జీని పెంచుతాయని చెబుతున్నారు. కాగా జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే కడుపు నిండుగా ఉంటుందట. దాంతో త్వరగా ఆకలి అవ్వదు. దీంతో ఎక్కువగా తినం బరువు కూడా కంట్రోల్ అవుతుందట. తింటూనే బరువు తగ్గాలనుకునేవారికి ఈ జొన్నరొట్టెలు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. జొన్నల్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. పొటాషియం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ రెగ్యులేట్ అవుతుందట. దాంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుందని చెబుతున్నారు. ఈ రొట్టెలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా కాకుండా మెల్లిగా పెరుగుతాయట. దీంతో షుగర్ ఉన్నవారికి ఇది చాలా మంచిదని చెబుతున్నారు. అన్నం బదులు వారు ఈ జొన్న రొట్టెలు తింటే షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయవచ్చట.