Good Teeth: ఈ కూల్ డ్రింక్స్ అస్సలు తాగకండి.. తాగితే మీ పళ్లు ఉడిపోవడం ఖాయం?
మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు టీ, కాఫీ,జ్యూస్, కూల్ డ్రింకులు ఇలా ఏదో ఒకటి తాగుతూనే
- By Nakshatra Published Date - 12:30 PM, Fri - 22 July 22
మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు టీ, కాఫీ,జ్యూస్, కూల్ డ్రింకులు ఇలా ఏదో ఒకటి తాగుతూనే ఉంటాము. ఇలా మాదకద్రవ్యాలు చాలా వరకు మన దంతాలకు హాని కలిగించేవేనని నిపుణులు సూచిస్తున్నారు. పళ్ళను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా మనం తీసుకునే ఆహారం పానీయం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి అంటున్నారు నిపుణులు. అలా కాకుండా దంతాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పళ్ళు గార పట్టడం,నల్లగా అవ్వడం, నోటి నుంచి దుర్వాసన రావడం, చిగుళ్ల వ్యాధులు, చిగుళ్ల వాపు లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని రకాల కూల్ డ్రింక్స్ దంతాలకు హాని కలిగిస్తాయట. మరి దంతాలకు హాని కలిగించే ఆ ఏడు రకాల డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యాసిడ్, చక్కెర పదార్థాలున్న డ్రింక్స్: దంతాల పైన పొరలో ఉండే ఎనామిల్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే దంతాలపై ఎనామిల్ ఉన్నంతవరకు దంతాలకు రక్షణ ఉంటుంది. అతిగా చక్కెర, యాసిడ్ లక్షణాలు ఉన్న డ్రింక్స్ తో ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ఎసిడిక్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల దంతాలపై ఎనామిల్ పొర మెత్తబడుతుందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల దంతాలు సెన్సిటివ్ గా మారుతాయి. ఏ మాత్రం ఒత్తిడి పడినా దెబ్బతింటాయి. ఇక అతిగా చక్కెర ఉన్న పదార్థాల కారణంగా దంతాల మధ్య సందులు, చిగుళ్లలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అవి విడుదల చేసే యాసిడ్లు దంతాలను దెబ్బతీస్తాయి.
డైట్ సోడా: చక్కెర లేకుండా ఉండే డైట్ సోడాలను తాగుతుంటారు. వాటితో ప్రమాదం ఉండదని భావిస్తుంటారు. కానీ ఈ సోడాల్లో కూడా యాసిడ్ పదార్థాలు ఉంటాయని దంతాలను దెబ్బతీస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
పళ్ల రసాలు: పళ్ల రసాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ నారింజ ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ జాతి పళ్ళ రసాల్లో ఉండే యాసిడ్ లక్షణాలు దంతాలను దెబ్బతీస్తాయి. అందువల్ల పళ్ళ రసాలను స్ట్రా ఉపయోగించి తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్పోర్ట్స్-ఎనర్జీ డ్రింక్స్: శరీరం బాగా అలసిపోయినప్పుడు వెంటనే చాలామంది స్పోర్ట్స్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు తాగుతుంటారు. ఇది అటువంటి ఎనర్జీ డ్రింకులలో అత్యధిక స్థాయిలో చక్కెరలు ఉంటాయి. దానికి తోడు కృత్రిమ రంగులు కలుపుతారని అవి దంతాలకు హాని చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
టీ, కాఫీలు: టీ, కాఫీ వంటివి అతిగా తాగడం వల్ల దంతాల పై ఎనామిల్ దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. తక్కువ చక్కెర వేసుకొని తీసుకోవడం వల్ల ఇటు దంతాలకు, అటు శరీరానికి కొంత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
ఆల్కహాల్: ఆల్కహాల్ కూడా దంతాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటిలో చిగుళ్లు దెబ్బతిని వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట
బాటిల్ నీళ్లు: బయట బాటిళ్లలో నింపి విక్రయించే మంచి నీళ్లలో చాలా వరకు స్వల్పంగా ఎసిడిటిక్ లక్షణాలు ఉంటాయి. వాటిలో రుచి కోసం కంపెనీలు పలు రకాల పదార్థాలు కలుపుతారట.
Related News
Cholesterol: కూల్ డ్రింక్స్, వేయించిన ఫుడ్స్.. కొలెస్ట్రాల్ సమస్యను పెంచుతాయా..?
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ముఖ్యమైనది సరైన ఆహారపు అలవాట్లు. కొలెస్ట్రాల్ రోగులకు విషపూరితమైనటువంటి 3 ఆహారాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.