Turmeric Water: ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీటిని ఇలా తాగితే అందంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీ సొంతం!
రోజు ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా అందం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి పసుపు నీటితో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..
- By Anshu Published Date - 12:02 PM, Tue - 15 April 25

పసుపు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పసుపును కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా, అందం కోసం కూడా వినియోగిస్తూ ఉంటారు. మనం తినే చాలా రకాల కూరలలో ఫుడ్లలో పసుపు ఉన్న తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే మార్కెట్ లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా పసుపును వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి పసుపుతో తయారు చేసిన ఫేస్ క్రీములు సోపులు వంటివి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే పసుపును నీటిలో కలుపుకుని తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. ఉదయం పూట పసుపు నీళ్లు తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని మలినాలను దూరం చేయడంతో పాటు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో తోడ్పడతాయట. ఫిట్ గా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ అలా ఫిట్ గా ఉండేందుకు అవసరమైన వ్యాయామం, డైట్ లాంటివి కొందరే పాటిస్తారు.
రోజూ వారీ లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పులు చేసుకోకుండా ఫిట్ గా మారిపోవాలంటే కష్టమే. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే. బరువు తగ్గాలి అనుకున్న వారికి పసుపు నీరు ఎంతో మేలు చేస్తాయి. పసుపు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు అన్ని తొలగిపోతాయట. అలాగే శరీరంలో కొవ్వు కూడా కరిగిపోతుందని చెబుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి పసుపు నీరు మంచి ఎంపిక అని చెప్పాలి.
కాగా పసుపు నీరు తాగడం జీర్ణక్రియ మెరుగుపడుతుందట ఉబ్బరం, గ్యాస్ తగ్గుతుందట. ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుందట. అలాగే మెదడు వాపు కూడా తగ్గుతుందట. జ్ఞాపకశక్తి, దృష్టి పెరుగుతుందట. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రితమవుతాయట. వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉంటారట. అలాగే ఒత్తికి గురయ్యేవారికి మంచి ఔషధం అని చెప్పాలి. అయితే ఈ పసుపు నీరు ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడం మంచిదట. రుచి కోసం ఒక స్పూన్ తేనె లేదా నిమ్మరసం చేర్చుకోవచ్చట.