Beauty Tips: ముఖంపై మొండి మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గాలంటే పచ్చిపాలతో ఇలా చేయాల్సిందే!
ముఖంపై ఉండే మొండి మచ్చలు అలాగే డార్క్ స్పాట్స్ తగ్గాలి అంటే పచ్చిపాలతో కొన్నింటిని కలిపి ముఖంపై అప్లై చేయడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:32 AM, Wed - 25 December 24

మామూలుగా ముఖంపై వచ్చేముండి మచ్చలు డార్క్ స్పాట్స్ వంటివి తొలగించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇవేమీ లేకుండా కేవలం ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి వీటిని తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకు పచ్చిపాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. పాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని పెంచడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చలికాలంలో చర్మ సంరక్షణలో పాలను చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
పచ్చి పాలలో అనేక పోషకాలు, ఎంజైమ్ లు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, సహజంగా మెరిసేలా చేస్తాయి. అయితే పచ్చిపాలలో ఇంట్లో దొరికే వాటిని వాడితే మంచి ఫలితాలు ఉంటాయట. ముఖం నుంచి మొండి మచ్చలు తొలగించడానికి పచ్చి పాలలో పసుపు కలిపి అప్లై చేయవచ్చు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లియర్ చేయడంలో మఖాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. చర్మం పై ముడతలు, మచ్చలు కూడా తొలగిస్తుందని చెబుతున్నారు. అలాగే రెండు నుంచి 3 చెంచాల పాలలో చిటికెడు పసుపు కలపడం ద్వారా మందపాటి పేస్ట్ సిద్ధం అవుతుంది. ఇప్పుడు కాటన్ సహాయంతో ముఖానికి పట్టించాలి. ఇప్పుడు దీన్ని 4 నుంచి 5 నిమిషాల పాటు అప్లై చేసిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
మీరు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు. అలాగే పచ్చిపాలలో తేనె కలిపి అప్లై చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. నిజానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ తేనెలో ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి పాలు తేనె మిశ్రమం చర్మాన్ని శుభ్రంగా మెరిసేలా చేయడంతో పాటు,పిగ్మెంటేషన్ ను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మంపై మెరుపును తీసుకురావడానికి మీరు తేనె, పచ్చి పాల మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు 4 నుంచి 5 టీ స్పూన్ల పాలలో 1 టీ స్పూన్ తేనె కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముఖానికి అప్లై చేసి సర్క్యులేషన్ మోషన్‌లో మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ముల్తానీ మిట్టిని ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముల్తానీ మిట్టిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేసి అందులో 1 చెంచా పాలు కలపాలి. ఈ మెత్తని పేస్ట్‌ని మీ ముఖంపై 5 నుంచి 10 నిమిషాల పాటు అప్లై చేయండి. ఆరిపోయిన తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మచ్చలు, ముడతల్ని తగ్గించడంలో ఈ రెమిడీ ప్రభావవంతంగా పనిచేస్తుంది.