Headache: తలనొప్పి భరించలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని నేచురల్ టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 13-08-2024 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఒత్తిడి టెన్షన్స్ కారణంగా తల నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రోజుల్లో తలనొప్పి అన్నది సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల మందులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వీటివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే చాలామంది తలనొప్పిగా అనిపించినప్పుడు ఎక్కువగా టాబ్లెట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదని చెప్పాలి. మరి మందులను ఉపయోగించకుండా తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో అందుకు ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తరచుగా తలనొప్పి వస్తూ ఉంటే నుదుటిన చల్లని బ్యాండేజ్ ని పెట్టాలి. లేకపోతే కాటన్ క్లాత్ లేదా టవల్ లో ఐస్ క్యూబ్స్ ను పెట్టి కూడా నుదుటిన పెట్టుకోవడం వల్ల తలనొప్పి నుంచి బయటపడవచ్చు. చల్లని నీటితో కూడా తలను కడుక్కోవచ్చు. దీనివల్ల తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుందని చెబుతుంది. అయితే తలనొప్పి రావడానికి ఎన్నో రకాల కారణాలు కూడా ఉంటాయి. కొన్నికొన్ని సార్లు టోపీలు, స్విమ్మింగ్ గాగుల్స్ లేదా టైట్ రబ్బర్ బ్యాండ్లు ధరించడం కూడా తలనొప్పి వస్తుంది. అందుకే తలనొప్పి వచ్చినప్పుడు మీ జుట్టును లీవ్ చేయాలి. పోనీటెయిల్ వేసిన ప్రాంతాన్ని వేళ్లతో మసాజ్ చేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే తలనొప్పి నుంచి బయటపడటానికి ఆక్యుప్రెషర్ కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట.
మీరు ఈ ప్రక్రియను రెండు చేతులకు 5 నిమిషాలు రిపీట్ చేయాలి. ఇది కూడా తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ఎక్కువ సేపు చూయింగమ్ వంటివి నమ్మడం వల్ల కూడా తలనొప్పి వస్తుందట. ఇలా చేయడం వల్ల దవడలలో నొప్పి మొదలయ్యి ఈ నొప్పి తలకు చేరుకుంటుంది. దీన్ని తట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు అల్లంను నీటిలో మరిగించి వడకట్టి ఆ నీటిని తాగవచ్చు. దీన్ని టీ లేదా కషాయంలో కలుపుకుని తాగితే తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందట. అలాగే తలనొప్పితో బాధపడుతున్నప్పుడు పుదీనా ఆకులను గ్రైండర్ లో గ్రైండ్ చేసి దాని రసాన్ని నుదుటిపై అప్లై చేయడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుందట. పుదీనాలో తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది..