Neck Pain: మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఒక్క రోజులో మాయం అవడం ఖాయం!
మెడనొప్పితో నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల ఆ నొప్పిని ఒకే ఒక్క రోజులో మాయం చేసుకోవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:34 AM, Tue - 21 January 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది మెడ నొప్పి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే మెడ నొప్పి రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కంప్యూటర్ వైపు లేదా మొబైల్ ఫోన్ల వైపు తదేకంగా ఒకే పొజిషన్లో ఉంచి చూడడం, టీవీలు ఎక్కువగా చూడడం లాంటి వాటి వల్ల మెడనొప్పి వస్తుంది. ఇవే కాకుండా చాలా రకాల కారణాల వల్ల కూడా మెడ నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మెడ నరాలు పట్టేసి తల పక్కకు తిప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.. మెడను ఒక పక్కకు కూడా తిప్పడానికి వీలుపడదు. మరి మెడ నొప్పి తగ్గాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెన్నూపూసలో వుండే డిస్కులు వత్తిడికి గురయి ఒకదాని పైన ఒకటి ప్రెజర్ ఏర్పడడం వల్ల మెడనొప్పి వస్తుంది.
ఈ ఒత్తిడికి గురి కాకూడదు అనుకుంటే మెడను, వెన్నుపూసను వంచకుండా కూర్చుంటే ఈ మెడనొప్పి రాకుండా వుంటుంది. వచ్చినా త్వరగా తగ్గుతుంది. మెడనొప్పి రాగానే రాత్రి పడుకునే సమయంలో దిండును ఉపయోగించవద్దు. దిండు లేకుండానే పడుకోవాలి. కూర్చొని ఉద్యోగం చేసేవారు, మెడను వంచి ఉద్యోగం చేసేవారు దిండు వాడకపోతే జరిగే నష్టం ఏమీ లేదని, దాని వల్ల మెడనొప్పి రాకుండా వుంటుందని నిపుణులు చెబుతున్నారు. మెడకు కొబ్బరి నూనె లేదా మస్టర్డ్ ఆయిల్ రాసి దానిపై వేడి నీళ్లతో కాపడం చేసుకోవాలి. లేదంటే మెడకు నూనె రాసుకున్న తరువాత మెడపై కొన్ని నిమిశాల పాటు వేడినీళ్లు పోసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుందట. నీరు మరీ ఎక్కువ వేడి లేకుండా జాగ్రత్తపడాలి. అయితే మెడనొప్పి ఉన్నప్పుడు మెడను ముందుకు వంచే పనులు గానీ, వ్యాయామాలు గానీ చేయకూడదు. సూర్య నమస్కారాలు, ఆసనాలు, వ్యాయామాలు కొన్ని రోజుల వరకు ఇవేవీ చేయకుండా ఆపివేయాలి.
ఆఫీసుల్లో కూర్చున్నా లేక ఇంట్లో కూర్చున్నా మెడను నిటారుగా మాత్రమే పెట్టాలి. అప్పుడు నరాల పైన ఒత్తిడి తగ్గి మెడనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. మెడను నిటారుగా పెట్టి అలసిపోయినట్టు అనిపిస్తే మెడను కొన్ని నిమిశాలు వెనక్కి వంచి అలాగే రిలాక్స్ అవ్వాలి. మెడను వెనక్కి వంచే యోగాసనాలు వుంటే వాటిని సాధన చెయ్యాలి. వీటి కోసం ఫిజియోథెరపీ సాయాన్ని కూడా తీసుకోవచ్చు. మూడు యోగాసనాల వల్ల మెడనొప్పిని తగ్గించుకోవచ్చని అంటున్నారు. మొదటిది మత్స్యాసనం. ఈ మత్స్యాసనంలో పద్మాసనం వేసుకొని కాళ్లను మడిచి తలను వెనక్కి వంచి భూమికి ఆనించాలి. పద్మాసనం వేసి చేయలేకపోతే పడుకొని కూడా ఈ మత్స్యాసనాన్ని వేయవచ్చు. ఇక రెండవది ఉష్ట్రాసనం. ఈ ఆసనంలో మోకాళ్లపై నిల్చొని మెడను వెనక్కి వంపి, చేతులను వెనక అరికాళ్లపై పెట్టడం వల్ల మెడనొప్పి తగ్గుతుంది. ఈ ఆసనంలో శరీరం ధనుస్సు లాగా మారుతుంది. దీని వల్ల వెన్నపూస కొంచం వంగడం వల్ల, డిస్కులను నరాలు వత్తడం వల్ల శరీరం, వెన్నుపూస, మెడ రిలాక్స్ అవుతుంది. మూడవది భుజంగాసనం. ఈ ఆసనంలో బోర్లా పడుకొని, అరచేతులను భూమికి ఆనంచి మెడను, వీపును పైకి లేపి వెనక్కి వంచే ప్రయంత్నం చేస్తారు. రెండు మూడు నిమిశాలు శరీరాన్ని ఈ ఆసనంలో వుంచితే మెడనొప్పి సులభంగా తగ్గుతుందట.