Lip Care: మీ పెదాలు సహజంగా ఎరుపు రంగులో మెరిసిపోవాలంటే ఈ విధంగా చేయాల్సిందే!
నల్లని పెదాలతో ఇబ్బంది పడుతున్న వారు పెదాలు సహజ ఎరుపు రంగులోకి మారాలి అంటే కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Mon - 23 December 24

మామూలుగా కొందరికి పెదవులు నల్లగా ఉంటే మరికొందరికి ఎరుపు రంగులో సహజంగా ఉంటాయి. గులాబీ లాంటి పదాలు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే అమ్మాయిలు వారి పెదాలకు మృదువుగా అందంగా ఉంచుకోవడం కోసం ఏవేవో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ముఖం అందంగా ఉండి పెదవులు నల్లగా ఉంటే ముఖం మొత్తం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. నల్లని పెదాలు ఉన్నవారు వారి పెదాలను ఎరుపు రంగులోకి మార్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే పెదాలు సహజ రంగులోకి ఎరుపు రంగులోకి మారాలి అంటే కొన్ని రకాల హోమ్ రెమెడీలు ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ రెమిడీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొన్ని నీటిలోకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కాటన్ బాల్ అందులో వేసి బాగా నానబెట్టాలి. ఆ తర్వాత దానిని పది నుంచి 15 నిమిషాల పాటు పెదాలపై అలాగే ఉంచాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉండటం వల్ల తెల్ల మచ్చలు సులభంగా తొలగిపోతాయి. మరో రెమెడీ విషయానికి వస్తే.. వెల్లుల్లి రెబ్బలను దంచి అందులో కాస్త బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీని రోజు మీ పెదవులపై అప్లై చేయాలి. అప్లై చేసిన కొన్ని నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ఈ రెమెడీ తప్పకుండా మీ పెదాలను అందంగా మార్చుతుంది.
అదేవిధంగా మీ పెదవులపై తెల్లటి మచ్చలు పోగొట్టుకోవడానికి కొబ్బరి నూనె పూసి బాగా మర్దన చేసి రెండు ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల రెండు వారాల్లోనే తెల్ల మచ్చలు తొలగిపోయి మార్పులు మీరే గమనించవచ్చు. అలాగే రెండు చెంచాల ఆవాల నూనెను ఒక చెంచా అరసిపొడిని కలిపి మచ్చలపై రాసిన కూడా తెల్లటి మచ్చలు పోయి పెదాలు సహజ ఎరుపు రంగులోకి మారుతాయట. యాపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్ ను ముంచి పెదవులపై మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పది నిమిషాలు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. పెదవుల మరకలు ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ రాసి గంటసేపు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని రోజుకు రెండు లేదా మూడు సార్లు అప్లై చేస్తే మచ్చలు సులువుగా తొలగిపోతాయట.