Eat Mango: షుగర్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
వేసవికాలంలో ఎక్కువగా లభించే మామిడి పండ్లను షుగర్ పేషెంట్లు తినవచ్చా తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:30 AM, Mon - 19 May 25

వేసవికాలం వచ్చింది అంటే చాలు మామిడి పండ్లు ఎక్కడ చూసినా కూడా లభిస్తూనే ఉంటాయి. ఈ సీజన్లో నోరూరించే పండు అంటే మామిడిపండే గుర్తుకు వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ పండును తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ పండుని ఉపయోగించుకొని రకాల వంటలు చేయడంతో పాటు ఎన్నో రకాల స్వీట్లు తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఆ సంగతి అటు ఉంచితే డయాబెటిస్ ఉన్నవారు కూడా మామిడిపండును ఇష్టంగా తింటూ ఉంటారు. మరి డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామిడిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగిఫెరిన్ అనే యాంటీఆక్సిడెంట్, పొటాషియంతో పాటు ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. మామిడి పండు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని, మామిడి పండులో ఫైబర్ కడుపు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. తరచుగా మామిడి పండు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట. మామిడి పండ్లలో మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాల్ని కలిగి ఉంటుందట. మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాగా షుగర్ వ్యాధితో బాధపడేవారు మామిడి పండ్లు తినవచ్చట. మామిడి పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.
మామిడి పండ తిన్నా అది వెంటనే రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచదట. మామిడి పండులో ఒక బయోయాక్టివ్ సమ్మేళనం కనిపిస్తుందట. దీనినే మాంగిఫెరిన్ అని అంటారు. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో సహాయపడతుందట. డయాబెటిస్ పేషెంట్లు మామిడి పండ్లను తినాలి అనుకుంటే తినవచ్చు కానీ మోతాదుకు మించి తినకూడదని చెబుతున్నారు. తక్కువగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ఒక మామిడి పండులో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. షుగర్ పేషెంట్స్ పండ్ల ద్వారా సుమారు 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు తీసుకోవచ్చని చెబుతున్నారు. మామిడి పండ్లు తిన్న తర్వాత రక్తంలో చక్కర స్థాయిలు అదుపులోనే ఉంటాయట. మామిడి పండులో ఉండే ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణ రేటును పరిమితం చేయడానికి సహాపడుతుందట. కాగా మామిడి పండ్లలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి సహాయపడతాయట.